- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
లారీని ఢీకొట్టిన ఇన్నోవా.. ఇద్దరు మృతి

దిశ,అనంతగిరి : ఇనోవా కారు లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్- బొజ్జ గూడ తండా గ్రామ శివారులో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మేళ్లచెరువు మండలం వేపల సింగారం గ్రామానికి చెందిన సోము కృష్ణారెడ్డి, అమ్మిరెడ్డి పద్మ, ఉపేందర్ రెడ్డి, బ్రహ్మారెడ్డి నలుగురు పని నిమిత్తం ఖమ్మం వెళ్లి కోదాడ కు తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలోనే ఖమ్మం కోదాడ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా జరుగుతున్న పనులలో లారీ వాటర్ ట్యాంకర్ తో మొక్కలకు నీళ్లను కొడుతుంది. ఈ క్రమంలో లారీ ఒకేసారి ముందుకు మూవ్ ఇవ్వడంతో వెనక నుండి కారు వచ్చి ఢీకొనట్లుగా స్థానికులు తెలుపుతున్నారు. దీంతో అక్కడికక్కడే సోము కృష్ణారెడ్డి అమ్మీ రెడ్డి పద్మ మృతి చెందారని ఉపేందర్ రెడ్డి బ్రహ్మారెడ్డికి తీవ్ర గాయాలైనట్లుగా సమాచారం. మృతదేహాలను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.