పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల

by Shamantha N |
పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈరోజు ఉదయం 10వ తరగతి పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. ఈ సంవత్సరం అత్యధికంగా 86.34 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. కాగా, మొత్తం 10.15 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, అందులో 8.43 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ పరీక్షలను ఫిబ్రవరి 18 నుంచి 27 వరకు నిర్వహించారు. మెమారి విద్యాసాగర్ మెమోరియల్ స్కూల్ కు చెందిన అరిత్ర పాల్ అనే విద్యార్థి 99.14 శాతం మార్కులు సాధించి రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించాడు. సయంతన్ గరై, అవిక్ దాస్ అనే ఈ ఇద్దరు విద్యార్థులు 700 లకు గాను లో 693 మార్కులు సాధించి రెండవ స్థానంలో నిలిచారు.

Advertisement

Next Story