చలో తాడేపల్లి.. సీఎం జగన్ ఇంటి వద్ద టెన్షన్ టెన్షన్..

by Anukaran |   ( Updated:2021-07-18 23:43:01.0  )
student unions protest
X

దిశ, వెబ్‌డెస్క్ : సీఎం జగన్ ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. జాబ్ క్యాలెండర్ పేరుతో ముఖ్యమంత్రి నిరుద్యోగులను మోసం చేస్తున్నాడనే కారణంతో తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయ ముట్టడికి విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో సీఎం నివాస పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ముగ్గురు ఎస్పీలు, డీఎస్పీలు సహా వెయ్యి మంది పోలీసులు భద్రతను సమీక్షిస్తున్నారు. తాడేపల్లికి వెళ్లే పరిసరాల్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు.రాజధానిలో రైతు నేతలకు కూడా ముందస్తుగా పోలీసులు సీఆర్పీసీ సెక్షన్ 149కింద నోటీసుల జారీచేశారు.

ప్రకాశం బ్యారేజీ, వారధి వద్ద వాహనాల తనిఖీలు కొనసాగుతున్నాయి. పలువురు అనుమానితులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా తాడేపల్లి పెట్రోల్ బంక్ నుండి సీఎం నివాసానికి వెళ్లే దారిలో 4 చెక్ పోస్టులను ఏర్పాటుచేశారు. అయితే, 2లక్షల 30వేల ఉద్యోగాలు కల్పించాలనే డిమాండ్‌తో చలో తాడేపల్లికి తరలి రావాలంటూ నిరుద్యోగులకు ఆల్ పార్టీ విద్యార్థి, యువజన సంఘాలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story