గచ్చిబౌలిలో గందరగోళం

by Shyam |
గచ్చిబౌలిలో గందరగోళం
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: జిహెచ్ఎంసి ఎన్నికల పోలింగ్ సందర్భంగా నగరంలో టిఆర్ఎస్, బిజెపి పార్టీ వర్గాల మధ్య ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి లో రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. దీంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టిఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారు అనే ఆరోపణలతో బిజెపి నాయకులు కార్యకర్తలు టిఆర్ఎస్ వర్గీయులను అడ్డుకోవడంతో ఘర్షణ మొదలైంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.

Advertisement

Next Story