జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత

by srinivas |
jc prabhakar reddy
X

దిశ ఏపీ బ్యూరో: అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఎస్-3 వాహనాలను ఫోర్జరీ డాక్యుమెంట్ల ద్వారా బీఎస్-4 వాహనాలుగా నమ్మించి విక్రయించి మోసం చేశారంటూ లారీ ఓనర్లు ధర్నా చేపట్టారు. నష్టపరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఆయన నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీనిపై రెండు రోజుల క్రితమే రవాణా శాఖ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. జేసీ‌ ట్రావెల్స్‌ మాజీ ఉద్యోగులు నాగేశ్వరరెడ్డి, సుబ్బారెడ్డి ఫిర్యాదుతో జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు మరో ఐదుగురిపై పోలీసులు చీటింగ్‌ కేసు నమోదు చేశారు.

Advertisement

Next Story