'నన్ను వాళ్లు పొల్లు పొల్లు కొట్టారు సార్'.. పీఎస్ లో ఫిర్యాదు చేసిన మైనర్

by Sumithra |   ( Updated:2021-11-07 02:03:36.0  )
Karnataka-Minor1
X

దిశ, వెబ్ డెస్క్: కందిపప్పును దొంగతనం చేశానంటూ ఆరోపణ చేస్తూ తనపై పదిమంది దాడి చేశారంటూ పోలీస్ స్టేషన్ లో ఓ మైనర్ బాలుడు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని గుట్టిఘర్ లో గత నెల 27వ తేదీన ఓ మైనర్ బాలుడిపై పది మంది కలిసి దాడి చేశారు. కందిపప్పు దొంగతనం చేశావంటూ ఆ బాలుడిని ఇష్టానుసారంగా తిడుతూ దాడి చేశారు. ఆ కందిపప్పు దొంగతనం చేసింది కాదని.. తన తల్లిదండ్రులు పండించిన కందిపప్పును తీసుకెళ్తున్నానని చెప్పినా వినకుండా ఆ బాలుడిపై తీవ్రంగా దాడి చేశారు. దీంతో ఆ బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈనెల 2న ఆ బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story