భక్తులకు అదిరిపోయే కానుక.. దుర్గగుడి పాలకమండలి కీలక నిర్ణయాలు

by srinivas |   ( Updated:2021-09-08 07:57:42.0  )
భక్తులకు అదిరిపోయే కానుక.. దుర్గగుడి పాలకమండలి కీలక నిర్ణయాలు
X

దిశ, ఏపీబ్యూరో : రాబోయే దసరా ఉత్సవాల్లో భక్తులకు ఇబ్బంది కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్టు దుర్గగుడి పాలకమండలి వెల్లడించింది. ప్రతీ భక్తుడికి 250 గ్రాముల దద్దోజనం, 250 గ్రాముల సాంబార్‌ రైస్‌ను ప్రసాదంగా పంపిణీ చేయాలని పాలకమండలి తీర్మానించింది. విజయవాడలోని దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానంలో బుధవారం పాలకమండలి సమావేశం జరిగింది. ఆలయ మహామండపంలో పాలక మండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఈవో భ్రమరాంబ, పాలక మండలి సభ్యులు, ఇతర అధికారులు హాజరయ్యారు. మొత్తం 66 అజెండాలపై పాలకమండలి చర్చించింది.

భక్తులకు అమ్మవారి డాలర్ పంపిణీ..

దుర్గగుడిలో దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని పాలకమండలి నిర్ణయించింది. దసరా ఉత్సవాలకు సంబంధించి భక్తులకు ఏ రకమైన ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. ప్రతీ భక్తుడికి 250 గ్రాముల దద్దోజనం, 250 గ్రాముల సాంబార్ రైస్ ప్రసాదంగా పంపిణీ చేయాలని పాలకమండలి తీర్మానం చేసింది. అలాగే అమ్మవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికీ కుంకుమ, అమ్మవారి ప్రతిమ ఉన్న డాలర్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. దసరా ఏర్పాట్లపై పాలకమండలి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. కలెక్టర్‌, కో-ఆర్డినేషన్‌ కమిటీల సమన్వయంతో ఉత్సవాలకు బడ్జెట్‌ను కేటాయిస్తామని పేర్కొంది. గత దసరాకు సీఎం జగన్ రూ. 70 కోట్ల నిధుల విడుదల చేశారని అందుకు సంబంధించి పనులు పూర్తి చేసినట్టు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed