ఏపీలో దంచికొడుతున్న ఎండలు

by srinivas |
ఏపీలో దంచికొడుతున్న ఎండలు
X

దిశ, వెబ్‌డెస్క్: యాస్ తుఫాన్ ప్రభావంతో గాలిలో తేమ బాగా తగ్గడంతో.. ఏపీలో ఎండలు దంచికొడుతున్నాయి. ఎండలకు తోడు వడగాల్పులు వీస్తుండటంతో.. జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నెలాఖరు వరకు పరిస్థితి ఇలాగే ఉంటుదని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, విజయనగరం జిల్లాల్లోని పలు మండలాల్లో నేడు, రేపు వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.

నిన్న రాజమండ్రిలో అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వగా.. నందిగామ, బాపట్లలో 42 డిగ్రీలు, విశాఖపట్నంలో 42.2 డిగ్రీలు, విజయవాడ, మచిలీపట్నంలో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదైంది. ఇక కాకినాడ, కావలిలో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదైంది.

Advertisement

Next Story

Most Viewed