జొమాటో.. 10 నిమిషాల ఫుడ్ డెలివరీ సర్వీస్.. నవ్విపోదురు గాక!

by Mahesh |   ( Updated:2022-03-22 10:37:59.0  )
జొమాటో.. 10 నిమిషాల ఫుడ్ డెలివరీ సర్వీస్.. నవ్విపోదురు గాక!
X

దిశ, ఫీచర్స్ : దేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన ఫుడ్ డెలివరీ అప్లికేషన్‌లలో ఒకటైన జొమాటో, ఆహార ప్రియుల కోసం10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ సర్వీస్ అందిస్తామని తాజాగా ప్రకటించింది. ఇప్పటివరకు వివిధ టెక్ ప్లాట్‌ఫామ్స్ 10 నిమిషాల కిరాణా డెలివరీ సర్వీస్ అందించడం చూశాం కానీ ఫుడ్ డెలివరీ సర్వీస్‌లో ఇదో కొత్త ప్రయోగం. 'జొమాటో ఇన్‌స్టంట్' పేరుతో దీన్ని ఇంట్రడ్యూస్ చేయగా, ఈ మోడల్‌ను పరీక్షించేందుకు గురుగ్రామ్‌లో పైలట్ ప్రాజెక్ట్‌ను అమలు చేయనుంది..

కొన్ని నెలల క్రితం స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ను ప్రారంభించిన తర్వాత, జొమాటో బ్లింకిట్‌లో పెట్టుబడి పెట్టింది (గతంలో గ్రోఫర్స్ అని పిలుస్తారు). Blinkit, దాని 10 నిమిషాల కిరాణా డెలివరీ సర్వీస్ ద్వారా దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందగా, ప్రస్తుతం బ్లింకిట్‌తో జట్టుకట్టిన జొమాటో ఇన్‌స్టంట్ ఫుడ్ డెలివరీ సర్వీస్‌తో ముందుకు వచ్చింది. ఈ మేరకు అధిక డిమాండ్ ఉన్న కస్టమర్ పరిసరాలకు సమీపంలో ఉన్న 'ఫినిషింగ్ స్టేషన్ నెట్‌వర్క్' నుంచి కంపెనీ త్వరిత డెలివరీలను పూర్తి చేస్తుంది. ప్రస్తుతం పైలట్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా గురుగ్రామ్‌లో నాలుగు స్టేషన్లు ఏర్పాటుచేశారు.

జొమాటో ఉపయోగించే ఫినిషింగ్ స్టేషన్స్.. జెప్టో, బ్లింకిట్ వంటి శీఘ్ర వాణిజ్య సంస్థలు ఉపయోగించే డార్క్ స్టోర్ మోడల్‌ను పోలి ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో అత్యధికంగా అమ్ముడయ్యే ఆహార పదార్థాల డిమాండ్ పరంగా, హైపర్‌లోకల్ ప్రాధాన్యతల ఆధారంగా ప్రతీ ఫినిషింగ్ స్టేషన్‌లో దాదాపు 20-30 ఫుడ్ ఐటెమ్స్ అందుబాటులో ఉంటాయి. అంతేకాదు ఈ పద్ధతిలో కస్టమర్‌కు దాదాపు 50 శాతం ధర తగ్గే అవకాశముంది.

అయితే రహదారి పరిస్థితులు, ట్రాఫిక్, వాతావరణం మొదలైన అంశాలు 10 నిమిషాల డెలివరీ ప్లాన్‌కు అతిపెద్ద సవాళ్లుగా మారుతున్నాయి.ఈ క్రమంలో నెటిజన్లు మీమ్స్‌తో పోటెత్తుతున్నారు. ఇలా జొమాటో ప్రకటన వచ్చిందో లేదో అలా 'నవ్విపోదురు గాక' అని విమర్శలు మొదలెట్టేశారు.

టెక్ పరిశ్రమలో మనుగడ సాధించడానికి కొత్త ఆవిష్కరణలు ఎలా అవసరమవుతాయో ఇక్కడ కూడా ఇతరుల కంటే కొత్తగా కస్టమర్‌కు అవసరమైన పనులు చేస్తేనే పోటీలో ఉంటాం. ప్రస్తుతం జొమాటో తరపున 30 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ చేస్తున్నాం. ఈ సమయాన్ని మేం తగ్గించకపోతే వేరే కంపెనీలు అమలు చేసే అవకాశముంది. అయితే దేశంలో 10 నిమిషాల కిరాణా డెలివరీ సేవ ఊపందుకున్నప్పటి నుంచి డెలివరీ ఏజెంట్ల జీవితాలు ప్రమాదంలో పడే వివిధ సంఘటనలు సంభవించాయి. ఈ విషయంలో జొమాటో డెలివరీ భాగస్వాముల పై​ ఎలాంటి ఒత్తిడి చేయదని స్పష్టం చేస్తున్నాం. అలాగే డెలివరీ పార్ట్‌నర్‌లు ఆలస్యంగా డెలివరీ చేసినందుకు జరిమానా విధించం. మేం ఎవరి ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెట్టలేమని మాటిస్తున్నాను.

- దీపిందర్ గోయల్, జోమాటో ఫౌండర


Advertisement

Next Story