- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'బరువు తగ్గితే బోనస్': ఈ కంపెనీ ఉద్యోగులకు భలే ఆఫర్!
దిశ, వెబ్‌డెస్క్ః నాజూకుగా ఉంటే మరింత ఉత్సాహంగా ఉంటారన్నది నిజమే. అందుకే, ఈ మధ్య అందరూ ఆరోగ్యంపైన దృష్టిపెడుతున్నారు. వ్యక్తులే కాదు కొన్ని కంపెనీలు కూడా వారి ఉద్యోగులను బరువు తగ్గమని ప్రోత్సహితస్తున్నాయి. అందులో ఈ ఇండియన్ కంపెనీ మరింత చురుకుగా పనిచేస్తుంది. ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నాడు, ఆర్థిక సేవల సంస్థ అయిన జెరోధ (Zerodha), ఆరోగ్యవంతమైన జీవనశైలిని గడపాలని చెబుతూ తన సిబ్బంది సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యే ప్రకటన చేసింది. అదీ ఒక సింపుల్ షరతుతో. బరువు తగ్గిన వారికి బోనస్‌గా సగం నెల జీతం ఇస్తామని చెప్పింది. గురువారం, సీఈఓ నితిన్ కామత్ ఈ ప్రకటన చేశారు. ఒక వ్యక్తి బాడీ మాస్ ఇండెక్స్ (BMI)ని కనుగొనడం ఆరోగ్యం, ఫిట్‌నెస్ ప్రయాణాన్ని ప్రారంభించడానికి సులభమైన పద్ధతి అని ఈ సందర్భంగా సీఈఓ పేర్కొన్నారు. కామత్ లింక్డ్‌ఇన్, ట్విట్టర్ పోస్ట్‌ల ప్రకారం, 25 కంటే తక్కువ BMI ఉన్న ఉద్యోగులు సగం నెల ఆదాయం బోనస్‌గా అందుకుంటారని వెల్లడించారు. అంతేకాదు, ఉద్యోగి BMI 24 కంటే తక్కువకు పడిపోతే ఆగస్టు నాటికి సగం నెల వేతనం బోనస్‌గా అందుతుందని తెలిపారు. "ఆరోగ్యకరమైన పోటీ"గా పేర్కొన్న ఈ ఛాలెంజ్‌లో పాల్గొనమని కామత్ ఇతర వ్యాపారాలను కూడా కోరారడం విశేషం.
We are running a fun health program at @zerodhaonline. Anyone on our team with BMI <25 gets half a month's salary as bonus. The avg BMI of our team is 25.3 & if we can get to <24 by Aug, everyone gets another ½ month as a bonus. It'd be fun to compete with other companies 😁 1/3
— Nithin Kamath (@Nithin0dha) April 7, 2022