బంగారు తెలంగాణ కాదు.. బీర్ల తెలంగాణ : వైఎస్ షర్మిల

by Vinod kumar |
బంగారు తెలంగాణ కాదు.. బీర్ల తెలంగాణ : వైఎస్ షర్మిల
X

దిశ, బయ్యారం: బంగారు తెలంగాణ కాదు.. బీర్ల తెలంగాణగా సీఎం కేసీఆర్ తయారు చేశారని వైఎస్సార్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో గాంధీ సెంటర్ లో ఆమెతో మాట ముచ్చట కార్యక్రమం ఇల్లందు నియోజకవర్గ నాయకులు బాణోత్ సుజాత అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అక్కడికి వచ్చిన ప్రజలతో మహిళలకు, నిరుద్యోగులకు పోడు భూముల డబుల్ బెడ్ రూంల నిర్వహనలో తెలంగాణ సీఎం ఏం పని చేశాడో.. స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ.. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో మూడు లక్షల ముప్పై వేల ఎకరాలు అప్పటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఇచ్చాడు. తెలంగాణ ఉద్యమ పార్టీ అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత పోడు భూములకు పట్టాలు ఇచ్చేందుకు అధికారులతో కుర్చీ వేసుకొని పరిష్కారం చేస్తానని ఓట్ల సమయంలో చెప్పి ఇంత వరకు వచ్చారా అని ప్రశ్నించారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతామని రాష్ట్ర విభజన హామీలో అన్నా నేటి వరకు రాలేదన్నారు.

ఈ జిల్లాలో పంచాయతీ కార్యదర్శి ఈసం వెంకటేశ్వర్లు అప్పులు తెచ్చి పంచాయతీ నిర్వహణకు ఖర్చు పెట్టి ఉత్తరం రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. బయ్యారానికి చెందిన ముత్యాల సాగర్ ఉద్యోగం నోటిఫికేషన్ రాలేదని ట్రైన్ కింద పడి చనిపోయాడు.. కనీసం వారి కుటుంబాన్ని పరామర్శించే సమయం లేదా.. అని విమర్శించారు. రైతుల ధాన్యంపై ఎఫ్ సీఐకి బాయిల్డు రైస్ ఇవ్వమని చెప్పి కేసీఆర్ రైతులను మోసం చేశాడని, వైఎస్సార్ ముఖ్యమంత్రి సమయంలో మహిళలకు పావలా వడ్డీ, రైతులకు రుణ మాఫీ, ఉచిత విద్యుత్, విద్యార్థులకు ఫీజు రియంబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ ఉన్నత వైద్యం ఫ్రీ చేశారు. 108, 104, పోడు పట్టాలు ఇచ్చారని ముఖ్యమంత్రి అంటే అలా ఉండాలి కదా.. కేసీఆర్ అట్లా పని చేస్తున్నారా.. పేద విద్యార్థులకు ఉచిత విద్యపై, పేద వారిని పరామర్శించారా.. తెలంగాణ ఉద్యమ కారులను పట్టించుకున్నారా.. అని ప్రశ్నించారు.

రూ.36 వేల కోట్లతో మిషన్ భగీరథ పథకం కింద 24 గంటలు నీరు ఇస్తామని చెప్పి ఇప్పుడు నీరు వస్తున్నాయనా అని అన్నారు. కమీషన్ల పనులు చేశారని, పేద వారికి పింఛన్లు ఇస్తున్నారా, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూంలు దళితులకు మూడు ఎకరాలు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించారా కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశాడని విమర్శించారు. రైతులకు పంట భీమా అటకెక్కించాడని, గారడి మాటలు చెప్పే కేసీఆర్ మాటలు నమ్మవద్దని అన్నారు. మా పార్టీని తెలంగాణలో ఆశ్వీరిందించండని, అందుకే ఆలోచించి ఓటు ఆయుధాన్ని వినియోగించని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధులు చైతన్య రెడ్డి, నీలం రమేశ్, పిట్ట రామిరెడ్డి, మహేశ్, సత్యవతి, జిల్లా నాయకులు గుర్రం అన్నపూర్ణ, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story