- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నీటి సంరక్షణ కోసం 1850 కి.మీ పాదయాత్ర.. విశాఖలో ముగింపు
దిశ, ఫీచర్స్ : ప్లాస్టిక్ నిషేధం, నీటి సంరక్షణ ఆవశ్యకతపై అవగాహన కల్పించడం సహా రైతు ఆత్మహత్యల గురించి ప్రజలను చైతన్యవంతుల్ని చేసేందుకు 25 ఏళ్ల యువకుడు సిద్ధమయ్యాడు. మహారాష్ట్రకు చెందిన అశుతోష్ జోషి స్థానిక నర్వాన్ బీచ్ నుంచి ఏప్రిల్ 10న తన పాదయాత్ర ప్రారంభించాడు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ మీదుగా దాదాపు 1,850 కి.మీ. కొనసాగించిన తన యాత్రను విశాఖపట్నంలో ముగించాడు.
'నా యాత్రను పూరీలో ముగించాలని అనుకున్నాను. అయితే ప్రకాష్ ఆమ్టే (ప్రఖ్యాత సామాజిక కార్యకర్త) సలహా మేరకు విశాఖపట్నం రావాలని నిర్ణయించుకున్నాను. నాలుగు రాష్ట్రాల్లోని ప్రజల నుంచి పూర్తి మద్దతు లభించింది. చాలా మందికి మరాఠీ, ఇంగ్లీష్ లేదా హిందీ అర్థం కానందున ఒడిశా, ఆంధ్రాలోని వ్యక్తులతో కమ్యూనికేట్ చేయడంలో కొంత సమస్య ఎదుర్కొన్నాను. ప్లాస్టిక్ నిషేధం, నీటి సంరక్షణ ఆవశ్యకత గురించి చర్చించేందుకు సర్పంచ్‌లు, గ్రామ పెద్దలు ఏర్పాటు చేసిన సమావేశాల్లో ప్రజలను కలిసినప్పుడు నేను వారి భావాలను అర్థం చేసుకోగలిగాను. భూగ్రహం ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పు ప్లాస్టిక్. ప్రభుత్వాలు ప్లాస్టిక్‌ను నిషేధిస్తాయి కానీ అవి తయారు చేసే పరిశ్రమలను మాత్రం మూసివేయవు. అందువల్ల మన ఆరోగ్యంతో పాటు భూగ్రహ క్షేమం, భావితరాల భవిష్యత్ కోసం ప్లాస్టిక్ వస్తువులను మనమే స్వచ్ఛందగా నిషేధించాలి. అలాగే నీటి వృథాను అరికట్టి వాన నీటిని ఒడిసిపట్టుకునేలా ఇండ్లు నిర్మించుకోవాలి. ఇక ఈ నడక నాకు భారతదేశాన్ని మరింత దగ్గరగా అర్థం చేసుకునేందుకు సాయపడింది. దయనీయమైన పరిస్థితుల్లో జీవిస్తున్న పేదల కోసం ప్రభుత్వాలు ఇంకా చాలా చేయాల్సి ఉంది. నా అనుభవాలతో డాక్యుమెంట్ రూపొందించాలని అనుకుంటున్నాను.
- ఆశుతోష్