పగబట్టిన పాము.. మూడోసారి కాటుకు యువతి..

by Mahesh |
పగబట్టిన పాము.. మూడోసారి కాటుకు యువతి..
X

దిశ, అదిలాబాద్: పాములు పగపడతాయని పూర్వీకులు చెప్పడమే.. తప్ప చాలా సందర్భాలలో అది నిజం కాకపోవచ్చు. కానీ ఓ పాము యువతిని పగబట్టి మూడు సార్లు కాటు వేసి చంపింది. వివరాల్లోకి వెళితే.. బేల మండలం బిడోడా గ్రామానికి చెందిన ప్రణాళి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ చదువుతోంది. ఈ యువతికి గతంలో రెండు సార్లు పాము కరిచింది. రెండు దఫాలు ఆమె పాము కాటు నుంచి ప్రాణాలతో బయట పడింది. కానీ చివరకు ఈ నెల 18న ఆమెను పాము కరిచింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. మృతి చెందింది. గత ఏడాది సెప్టెంబర్ లో ప్రణాళి తన నివాసంలో నిద్రిస్తున్న సమయంలో పాముకాటుకు గురి అయింది. కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. సుమారు నాలుగు లక్షలు ఖర్చు చేసి ఆమెను రక్షించుకున్నారు.

ఆ తర్వాత ఈ ఏడాది జనవరిలో మరోసారి ఆమె పాముకాటుకు గురి అయింది. ఇంటి ఆవరణలో కూర్చున్న సమయంలో ఆమెను పాము కరిచింది. ఈ సమయంలో కూడా ఆమె చికిత్స నుంచి కోలుకుంది. ఇలా రెండు సార్లు పాము కాటు వేసిన ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకుంది. ఈనెల 18న హోలీ వేడుకల్లో పాల్గొనేందుకు రంగులు తెచ్చుకొని కాలేజీ బ్యాగ్‌లో భద్రంగా పెట్టుకుంది. అయితే ఈ బ్లాగులో పాము దాగి ఉంది. బ్యాగ్‌లో నుంచి రంగులు తీస్తుండగా పాము కాటు వేసింది. యువతని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. రెండుసార్లు పౌర్ణమి రోజు కాటేయాగా ఒకసారి అమావాస్య రోజు కాటు వేయడంతో పాము పగ పట్టిందనీ అందుకే మూడుసార్లు వెంటాడిందనీ ప్రణాళి బంధువులు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed