అత్యాచార యత్నం కేసులో యువకుడికి మూడేళ్ల జైలు శిక్ష

by Satheesh |
అత్యాచార యత్నం కేసులో యువకుడికి మూడేళ్ల జైలు శిక్ష
X

దిశ, ఖమ్మం లీగల్: మైనర్ బాలికపై అత్యాచారం యత్నం కేసులో ఓ నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష తోపాటు రూ.4 వేలు జరిమానా విధిస్తూ గురువారం సెకండ్ ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ సెషన్స్ కోర్టు(POCSO ) న్యాయమూర్తి అఫ్రోజ్ అక్తర్ తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళితే.. అమ్మపాలేం గ్రామానికి చెందిన ఓ మహిళ యొక్క మనవరాలు బోనకల్ కస్తూర్బా గాంధీ పాఠశాలలోని హాస్టల్లో ఉంటూ 9వ తరగతి చదువుకుంటుంది‌. లాక్ డౌన్ సమయంలో ఆమె తన అమ్మమ్మ ఇంటికి వచ్చింది. 15-10-2020న ఫోటోగ్రాఫర్ అయినా నిందితుడు అయినాల చందర్ రావును ఫోటో తీయడానికి ఇంటికి పిలిచింది.

16-10-2020న ఫోటోలు ఇవ్వడానికి నిందితుడు ఆమె ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో మైనర్ బాలికను అత్యాచారం చేయబోయాడని కొణిజర్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా.. ఆ కేసును విచారించిన న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ తరుఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పసుపులేటి శ్రీనివాస్ వాదించగా.. లైజన్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, మోహన్ రావు, కోర్టు కానిస్టేబుల్ మధార్, శ్రీను, హోంగార్డ్ చిట్టిబాబులు సహకరించారు.

Advertisement

Next Story