మహిళల భద్రతకు కీలక నిర్ణయం తీసుకున్న యూపీ ప్రభుత్వం

by Harish |
మహిళల భద్రతకు కీలక నిర్ణయం తీసుకున్న యూపీ ప్రభుత్వం
X

లక్నో: రెండోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. మహిళా రక్షణ కోసం తీసుకొచ్చిన యాంటీ రోమియో స్వ్కాడ్లను యాక్టివేట్ చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. శనివారం నుంచి వీటిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు సీనియర్ అధికారి తెలిపారు. నవరాత్రుల తొలి రోజు నుంచి మహిళ రక్షణ కోసం పోలీస్ శాఖ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనుంది. యాంటీ రోమియో స్వాడ్లను పాఠశాలలు, కాలేజీల వద్ద మోహరిస్తారు. అంతేకాకుండా సాయంకాలం సమయాల్లో రద్దీ మార్కెట్లు, జన సముహాల్లోనూ పెట్రోలింగ్ నిర్వహిస్తామని అధికారులు చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed