- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లోకేశ్‌కు ఆ లక్షణాలు లేవు.. వైసీపీ ఎమ్మెల్సీ షాకింగ్ కామెంట్స్
దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. లోకేశ్‌కు ఎలాంటి రాజకీయ లక్షణాలు లేవని విమర్శించారు. కడపలోని వైసీపీ కార్యాలయంలో బుధవారం సి.రామచంద్రయ్య మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు దయవల్లే లోకేశ్‌కు ఎమ్మెల్సీ పదవి వచ్చిందని ఆ తర్వాత మంత్రి అయ్యారని.. కానీ ప్రజాక్షేత్రంలో లోకేష్ గెలవలేక పోయాడని ఎద్దేవా చేశారు.
లోకేష్ ఎంత అసమర్థుడో 40 ఏళ్ల టీడీపీ సంబరాల్లో తేలిపోయిందని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ ఏ ఉద్దేశ్యంతో అయితే పార్టీ పెట్టారో.. ఆ సిద్ధాంతం ప్రస్తుత టీడీపీలో కొరవడిందని విమర్శించారు. ప్రజలు ఎందుకు తిరస్కరించారో తెలుసుకోకుండా చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేయడం తగదని హితవు పలికారు.
చంద్రబాబు 27 ఏళ్లలో 6 సార్లు ఎన్నికలకు వెళ్తే.. 3 సార్లు ఓడిపోయారని గుర్తు చేశారు. అయితే ఈ అన్ని సందర్భాల్లో పొత్తులతోనే పోటీకి వెళ్లాడే తప్ప ఏనాడూ ఒంటరిగిపోటీ చేసి గెలుపొందలేదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆర్థిక నిపుణుడు కాకపోయినా.. ప్రజల కష్టాలు, బాధలు ఏంటో తెలుసుకుని వాటి శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచన చేసే గొప్ప నాయకుడు అని కొనియాడారు.
ఆర్థిక ఇబ్బదులున్నా సంక్షేమ పథకాల మొత్తాలను నేరుగా ప్రజల ఖాతాలోకి జమ చేసిన ఏకైక నాయకుడు జగన్ అని ప్రశంసించారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తే అభినందించాలని లేకపోతే బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని చంద్రబాబుకు ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య సూచించారు.