యాదాద్రి అలయ పునః ప్రారంభం, భద్రతా ఏర్పాట్లపై సమీక్ష సమావేశం

by Manoj |
యాదాద్రి అలయ పునః ప్రారంభం, భద్రతా ఏర్పాట్లపై సమీక్ష సమావేశం
X

దిశ, యాదగిరిగుట్ట : యాదాద్రి ప్రధానాలయ మహాకుంభ సంప్రోక్షణకు అధిక సంఖ్యలో వీఐపీలు వస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. ఈ నెల 28న ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా భద్రత ఏర్పాట్లు, వీవీఐపీలు, మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల విడిది కోసం వివిధ విభాగాల అధికారులతో శుక్రవారం యాదాద్రి కొండపైన వీవీఐపీ విడిది భవనంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వివిధ ప్రాంతాలకు చెందిన నాయకులు భారీగా వచ్చే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో వారికి వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

సీఎం కేసీఆర్ కు ప్రెసిడెన్షియల్ సూట్, మంత్రులకు విల్లాస్‌లలో, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు మన్నూరు కాపు భవనాలలో వసతి కల్పన చేయనున్నట్లు తెలిపారు. దీంతోపాటు రెడ్డి సత్రంలో సైతం వీఐపీలకు విడిదికి వినియోగించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. అనంతరం ప్రెసిడెన్షియల్ సూట్, మున్నూరు కాపు భవనాన్ని, మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా కొండపైన ఏర్పాట్లను పరిశీలించారు. కొండకింద పార్కింగ్, అన్నదానం, మంచినీళ్లు, విద్యుత్ సరఫరా, పోలీస్ భద్రతతో పాటు సకల వసతులపై సమీక్ష కూడా జరిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీ నారాయణరెడ్డి, వైటీడీఏ ఎస్ఈ వసంతనాయక్, ఆర్డీవో భూపాల్ రెడ్డి, ఏసీపీ నర్సింహారెడ్డి, వైటీడీఏ ఈఈ వెంకటేశ్వర్ రెడ్డి, ట్రాఫిక్ సీఐ సైదయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story