- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తొలి ప్రయాణానికి సిద్ధమైన వరల్డ్స్ లార్జెస్ట్ క్రూయిజ్ షిప్!
దిశ, ఫీచర్స్ : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన 'రాయల్ కరీబియన్' క్రూయిస్ లైనర్ సంస్థ.. 'వండర్ ఆఫ్ ద సీస్ పేరిట' భారీ క్రూయిజ్ షిప్‌ను రూపొందించింది. ఫ్రాన్స్, సెయింట్-నజైర్‌లోని చాంటియర్స్ డిఎల్ అట్లాంటిక్ షిప్‌యార్డ్‌లో మూడేళ్లుగా తయారీలోఉన్న ఈ క్రూయిజ్ షిప్.. ఈ నెల 4న ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్‌డేల్ నుంచి కరీబియన్ దీవులకు తొలి ప్రయాణాన్ని మొదలుపెట్టనుంది. 'వండర్ ఆఫ్ ద సీస్' క్రూయిజ్ నౌకలో 6,988 మంది అతిథులు సహా 2,300 మంది సిబ్బంది ప్రయాణించవచ్చు.
కాగా 362 మీటర్ల పొడవు, 64 మీటర్ల వెడల్పు గల ఈ నౌకలో 2,867 గదులు, 24 గెస్ట్ ఎలివేటర్స్ ఉన్నాయి. 20కి పైగా డైనింగ్ వెన్యూస్‌తో పాటు 11 బార్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవేకాక మూవీ థియేటర్, వండర్ ప్లే స్కేప్, ఓపెన్ ఎయిర్ కిడ్స్ ప్లే జోన్, క్లైమ్బింగ్ వాల్స్, గేమ్స్, ఫ్యామిలీ సూట్, వండర్ ల్యాండ్, లైవ్ మ్యూజిక్ థియేటర్ సదుపాయాలున్నాయి. ఇక ఈ షిప్ సెంట్రల్ పార్క్ లో 20,000కు పైగా మొక్కలు ఉండటం విశేషం. మొత్తానికి 18 అంతస్తుల్లో 36,857 టన్నుల బరువున్న ఈ నౌక 22 నాట్ల వేగంతో అలలపై దూసుకుపోతుంది.