- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
WorldCup: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం
దిశ, వెబ్‌డెస్క్: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం సాధించింది. 318 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ జట్టు కేవలం 162 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత మహిళలు వరల్డ్ కప్‌లో రెండో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించిన భారత్, నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేసింది. స్మృతి మందాన, హర్మన్ ప్రీత్ కౌర్ సెంచరీలతో చెలరేగడంతో భారత్ వరల్డ్ కప్ పోటీల్లో భారీ స్కోరు సాధించింది. స్మృతి మందాన (123) టాప్ స్కోరర్ గా నిలవగా, హర్మన్ ప్రీత్ కౌర్ (109) పరుగులు చేసింది. విండీస్ బ్యాటర్లలో ఓపెనర్లు డియాండ్రా 46 బంతుల్లో 62 పరుగులు చేయగా.. హేలీ మ్యాథ్యూస్ 36 బంతుల్లో 43 పరుగులతో బౌండరీనే లక్ష్యంగా దంచికొట్టి శుభారంభం చేశారు. అయితే వారిని నిలువరించడానికి భారత బౌలర్లు ఒక్కసారిగా రెచ్చిపోయి వరుసగా పెవిలియన్‌కు పంపడంతో కట్టడి చేసినట్లయ్యింది. ఓపెనర్లతో పాటు వచ్చినవాళ్లంతా వచ్చినట్లే వెనుదిరగాల్సివచ్చింది. 162 పరుగులకే అందరూ ఆలౌట్ అవ్వడంతో విండీస్‌పై టీమిండియా 155 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా బౌలర్లలో స్నేహ రాణా 3, మేఘ్నా 2 వికెట్లు, రాజేశ్వరి, పూజూ, ఝలన్ గోస్వామి తలో వికెట్ తీసి విండీస్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టారు.
𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗪𝗜𝗡!👏 👏
— BCCI Women (@BCCIWomen) March 12, 2022
Hundreds from @mandhana_smriti & @ImHarmanpreet 👍 👍
Impressive performance with the ball 👌 👌
The @M_Raj03-led #TeamIndia complete a clinical 1⃣5⃣5⃣-run victory over the West Indies. 🙌 🙌 #CWC22 | #WIvIND
Scorecard ▶️ https://t.co/ZOIa3KL56d pic.twitter.com/XG2jJTdV5P