- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'సమిష్టి కృషితో సమాజంలో మార్పు తీసుకురావొచ్చు'
దిశ ప్రతినిధి, హైదరాబాద్: పురుషులతో సమానంగా మహిళలు నేడు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని పలువురు వక్తలు అన్నారు. కోఠి లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ సర్కిల్ ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శంకర్ జయంత్, రీప్లేస్‌మెంట్ సర్జన్, ట్రామా స్పెషలిస్టు డాక్టర్ డాక్టర్ థాయిల్ చిరంజీవి, కన్సల్టెంట్ ప్రసూతి వైద్యుడు, గైనకాలజిస్ట్ డాక్టర్ సీహెచ్ వెంకట గనగ భవానీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం విభిన్నమైన, సమానమైన, సమ్మిళిత సమాజం కోసం పని చేస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. సమిష్టిగా కృషిచేస్తే సమానమైన ప్రపంచం కోసం అర్ధవంతమైన మార్పును తీసుకురాగలమన్నారు.
ఎస్‌బీఐ లేడీస్ క్లబ్ అధ్యక్షురాలు నుపూర్ జింగ్రాన్ మాట్లాడుతూ.. శ్రామిక మహిళలు సంతోషకరమైన, ఆరోగ్యకరమైన జీవితం కోసం తమ అభిరుచులను కొనసాగించాలని ప్రొత్సహించారు. సీజీఎం అమిత్ జింగ్రాన్ మాట్లాడుతూ.. మహిళా ఉద్యోగుల ప్రత్యేక అవసరాలు, సవాళ్లను తీర్చడానికి, అనుకూలమైన, సురక్షితమైన పని వాతావరణాన్ని అందించడానికి ఎస్‌బీఐ అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. పని ప్రదేశంలో లైంగిక వేధింపుల నివారణ వంటి అనేక కార్యక్రమాలను తమ బ్యాంక్ ప్రవేశపెట్టిందన్నారు. సీనియర్ మహిళా ఉద్యోగులు, కొత్తగా పదోన్నతి పొందిన, రిక్రూట్ చేయబడిన మహిళా ఉద్యోగులకు ''మైత్రేయి'' వంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టిందని వివరించారు. సవాళ్లతో కూడిన బాధ్యతలను స్వీకరించి, బ్యాంక్ పనితీరుకు విశేషమైన సహకారం అందిస్తున్న మహిళా శ్రామిక శక్తిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో జీఎం క్రిషన్ శర్మ, ఏజీఎం జి.రామకృష్ణ, పీఆర్వో హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.