Shruti Haasan: డేట్‌కి వెళ్తే డబ్బులు నాతోనే కట్టించేవారు.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

by sudharani |
Shruti Haasan: డేట్‌కి వెళ్తే డబ్బులు నాతోనే కట్టించేవారు.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ శృతి హాసన్ (Shruti Haasan) ఇటీవల ‘సలార్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక మూవీస్‌తోనే కాకుండా మల్టీ టాలెంటెడ్ (Multi Talented)గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. పాటలు పాడుతూ ప్రైవేట్ ఆల్బమ్స్ (Private Albums) చేస్తూ తన సత్తా చాటుడుకుంటోంది. సంపాదన విషయంలో చాలా క్లియర్‌గా ఉండే శృతి హాసన్ (Shruti Haasan).. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని డేట్‌కు వెళ్లినప్పుడు ఎదురైన చేదు అనుభవాల గురించి తెలిపింది.

‘మహిళలు (Womens) ఆర్థికంగా స్వతంత్రులుగా ఉండటం ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఆర్థిక విషయాలకు సంబంధించి ఎవరిపై ఆధారపడకూడదు. అలా నాకు ఇష్టం ఉండదు. అందుకే నా సంపాదన నేనే చూసుకుంటా.. నా ఖర్చులు నేను భరిస్తా. ఎప్పుడైనా ఎవరితోనైనా డేట్‌కు వెళ్లిన బిల్లులు నేనే కట్టాల్సి వచ్చేది. వాళ్లు కూడా నీ దగ్గర డబ్బు ఉందిగా కట్టేయ్ అన్నట్లు చూసేవారు. మొదట్లో ఎవరిని అడగకుండానే బిల్లులు కట్టేదాన్ని. ఎందుకంటే.. బిల్లు పే చెయ్యడం కూడా ఎదుటివ్యక్తులపై ప్రేమను చూపిస్తుంది. అయితే.. కొన్నాళ్లకు ఇదే విషయం మనం అడిగితే.. నువ్వు ఇష్టపడే కట్టావు కదా అంటారు. ఇలాంటివి ఎన్నో నాకు ఎదురు అయ్యాయి. అందుకే డబ్బు విషయంలో క్లియర్ (clear)గా ఉండాలని అర్థం చేసుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story