- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పీహెచ్‌డీ వదిలేసి సాగుబాట.. లక్షల్లో ఆర్జిస్తున్న కశ్మీరీ మహిళ
దిశ, ఫీచర్స్ : సొసైటీలో చాలామంది తమకు ఇష్టమైన కెరీర్ ఎంచుకోలేకపోతున్నారు. కుటుంబ సభ్యుల లేదా సన్నిహితుల ఒత్తిడి మేరకు అయిష్టంగానే నచ్చని కోర్సుల్లో చేరి నిత్యం అసంతృప్తిని ఎదుర్కొంటున్నారు. కానీ సెంట్రల్ కశ్మీర్, బుడ్గాం జిల్లాకు చెందిన ఇన్‌షా రసూల్ మాత్రం తన మనసుకు నచ్చింది చేసేందుకు పీహెచ్‌డీ చదువుకు ఫుల్‌స్టాప్ పెట్టేసింది. ఈ మేరకు 2018లో కొరియా నుంచి ఇండియాకు తిరిగొచ్చిన ఆమె అంకితభావంతో అనుకున్నది సాధించింది.
ఇన్‌షా దక్షిణ కొరియా యూనివర్సిటీలో మాలిక్యులర్ సిగ్నలింగ్‌ను అభ్యసిస్తున్న క్రమంలో సేంద్రియ వ్యవసాయాన్ని అన్వేషించాలనుకుంది. రెండేళ్లు కష్టపడి హోమ్‌గ్రీన్స్‌గా పిలువబడే 'ఫార్మ్-టు-ఫోర్క్' బ్రాండ్‌ను నిర్మించింది. తమకున్న 3.5 ఎకరాల భూమిలో కలల ప్రాజెక్టు ప్రారంభించి దున్నకం, విత్తనాలు వేయడం వంటి సాగు పనులకు కూలీలను నియమించింది. వృత్తిరీత్యా శాస్త్రవేత్త అయిన ఇన్‌షాకు పంట పండించేందుకు పరిశోధనలు చేస్తే సరిపోదని తెలుసు. ఈ క్రమంలోనే వివిధ సీజన్లలో వివిధ రకాల విత్తనాలతో నెలల తరబడి ప్రయోగాలు చేసింది. కానీ అపజయాలే పలకరించాయి. కొన్నిసార్లు పంట మొలకెత్తలేదు, మరికొన్నిసార్లు ఎరువు పనిచేయలేదు. అదనపు నీరు అందించడం లేదా అన్‌సీజన్‌లో విత్తడం.. ఇలా ఆరు నెలలకు పైగా ప్రయోగాలతోనే గడిచింది. అయినా వ్యవసాయాన్ని విడిచిపెట్టననే నిర్ణయమే ఆమె జీవితాన్ని మార్చేసింది.
ఇన్‌షా.. తన పిల్లల స్కూల్ యాక్టివిటీస్‌లో భాగంగా ఒకసారి స్ట్రాబెర్రీ ఫామ్‌ను సందర్శించిన తర్వాతే ఈ వృత్తిపై ఆసక్తి ఏర్పడిందని చెప్పింది. 'రంగురంగుల్లో తాజా స్ట్రాబెర్రీలు పండించేందుకు వారు ఉపయోగించిన అద్భుతమైన సాంకేతికతను చూసి ఆశ్చర్యపోయాను. కాశ్మీర్‌లో ఎవరైనా ఇలాగే చేస్తే బాగుంటుందని నా భర్తకు క్యాజువల్‌గా చెప్పాను. మన భూమిలోనే చేయమనడంతో ఆరు నెలల కఠోర ప్రణాళిక, పరిశోధన తర్వాత అన్నిటినీ విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాను' అని ఆమె వెల్లడించింది.
కాగా ఇన్‌షా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ పేజీలోనే తన పంట విక్రయిస్తోంది. 24 గంటల్లోనే ఎక్కువ శాతం ఉత్పత్తులు అమ్ముడవుతాయని ఆమె పేర్కొంది. ఈ మేరకు గత నవంబర్, డిసెంబర్‌లో దాదాపు రూ. 8 లక్షలు సంపాదించింది. ఫ్రెంచ్ బీన్స్, బఠానీలు, అలాగే బ్లాంచ్డ్ స్వీట్ కార్న్, టమోటాలను కూడా ఏడాది పొడవునా విక్రయిస్తోంది. అంతేకాదు ఇన్‌షా తన బ్రాండ్ పేరుతో దేశవ్యాప్తంగా కూరగాయలు, ఊరగాయలు వంటి విలువ ఆధారిత ఉత్పత్తులను విక్రయించేందుకు స్థానిక రైతులతో కలిసి పనిచేస్తోంది. ప్రతి నెల సగటున 15-20 మంది సభ్యులుగల 32 ఏజ్ గ్రూప్ రైతులకు మార్కెట్ ధరల కంటే ఎక్కువ ధరలు చెల్లిస్తున్నామని తెలిపింది.