కానరానిచోట కనిపించిన భార్య చెప్పులు.. అనుమానంతో తొంగిచూడగా..

by S Gopi |   ( Updated:2022-03-05 16:54:25.0  )
కానరానిచోట కనిపించిన భార్య చెప్పులు.. అనుమానంతో తొంగిచూడగా..
X

దిశ, కాల్వ శ్రీరాంపూర్: వ్యవసాయ బావిలోకి దూకి మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పందిళ్ల గ్రామంలో చోటు చేసుకుంది. బంధువులు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఇల్లందుల అహల్య(59) అనే మహిళకు, ఆమె భర్త మధ్య డబ్బుల విషయమై గొడవ జరిగింది. ఇటీవల తవ్విన బావి కోసం అప్పు తీర్చడానికి వ్యవసాయ భూమి అమ్మి అప్పు తీరుద్దామని భర్త రాజేశం చెప్పడంతో అందుకు ఆమె నిరాకరించింది. ఆ విషయమై ఆమె మనస్తాపానికి గురై ఇంటి నుండి బయటకు వెళ్లింది. రోజువారీగా శనివారం ఉదయం మృతురాలి భర్త రాజేశం పొలంకు నీళ్లు పెట్టేందుకు వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. అయితే, తన భార్య చెప్పులు బావి దగ్గర ఉండడంతో అనుమానం వచ్చి బావిలోకి చూడగా భార్య శవమై తేలుతూ కనబడింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story