- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యువకుడితో లేచిపోయిన నలుగురు పిల్లల తల్లి.. 3 ఏళ్లు సహజీవనం చేసిన తర్వాత..
దిశ, వెబ్ డెస్క్: నలుగురు పిల్లలున్న ఓ మహళ తన భర్తను, పిల్లలను వదిలేసి ప్రియుడితో పారిపోయింది. అతడితో మూడేళ్లపాటు సహజీవనం చేసింది. ఆ తర్వాత అతడిని చంపేసి తిరిగి భర్త వద్దకు చేరింది. పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఝార్ఖండ్ లోని సెరాయ్ కు చెందిన ఓ మహిళకు నలుగురు పిల్లలు, భర్త ఉన్నారు. అయితే, ఆ మహిళ ఓ యువకుడితో ప్రేమలో పడింది. అలా అతనితో ప్రేమలో పడిన ఆ మహిళ తన పిల్లలను, భర్తను వదిలేసి ప్రియుడితో పారిపోయింది. మూడేళ్లపాటు అతనితో సహజీవనం చేసినంక అతడికి మరో పెళ్లి అయిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య గొడవలయ్యాయి. ఈ క్రమంలో తిరిగి తన భర్త, పిల్లల వద్దకు వెళ్లాలని నిశ్చయించుకుంది. అందుకు ప్రియుడు ఒప్పుకోలేదు. కొద్దిరోజులపాటు ఆమెను ఇంట్లో బంధించాడు. ఆ తర్వాత నీతోనే ఉంటానని అతడిని నమ్మించింది. ఆ రోజు రాత్రి ఇద్దరు పడుకున్నారు. ప్రియుడు నిద్రపోయినంక అర్ధరాత్రి అతడిపై రాడ్డుతో దాడి చేసింది. దీంతో అతడు చనిపోయాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయి తన భర్త, పిల్లల వద్దకు చేరుకుంది. అయితే, ఆ ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఇంటి పక్కవారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.