పంచాయతీ కార్యదర్శి ఇంటి ముందు మహిళ ఆందోళన

by Mahesh |
పంచాయతీ కార్యదర్శి ఇంటి ముందు మహిళ ఆందోళన
X

దిశ, మిర్యాలగూడ: పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో అవంతిపురం పంచాయతీ కార్యదర్శి మదన్ మోహన్ ఇంటి ఎదుట గురువారం రాత్రి అరుణ అనే మహిళ ఆందోళన చేసింది. బాధిత మహిళ అరుణ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అవంతిపురం గ్రామంలో తండ్రి పట్టేటి సోములు నుంచి వారసత్వంగా తనకు 180 గజాల భూమి సంక్రమించిందన్నారు. పంచాయతీ రికార్డులో భూమిని తన పేరున నమోదు చేయమని కోరగా కార్యదర్శి రూ. 30 వేలు లంచం డిమాండ్ చేశాడని.. ఆన్‌లైన్‌లో పేరు నమోదు కు మళ్ళీ రూ.20 వేలు డిమాండ్ చేసి తన పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపించింది.

ఈ విషయమై కార్యదర్శి మదన్ మోహన్ ను వివరణ కోరగా సోములు కు సంభందించిన ఆస్తి పంపకాల వివాదం ఉంది. కుటుంబ సభ్యులు తామే వారసులం అంటుండగా అరుణ తన పేరుతో రికార్డులు నమోదు చేయమని ఒత్తిడి చేస్తుందన్నారు. దీంతో పెండింగ్లో ఉంచామని, తనపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

Advertisement

Next Story

Most Viewed