- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హైదరాబాద్ వాసులకు అదిరిపోయే న్యూస్.. బేగంపేట ఎయిర్‌పోర్టులో 24 నుంచి 'ఎయిర్ షో'
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టులో త్వరలోనే ఎయిర్ షో ప్రారంభం కానుంది. ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు వింగ్స్ ఇండియా-2022 పేరుతో ఎయిర్ షో నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా బేగంపేట ఎయిర్‌పోర్టు వేదికగా జరిగే ఈ ఎయిర్ షోలో పలు దేశీయ, అంతర్జాతీయ సంస్థలకు చెందిన అత్యాధునిక విమానాలు, జెట్లు, హెలికాప్టర్లు నగరవాసులను కనువిందు చేయనున్నాయి. కరోనా కారణంగా నాలుగేళ్ల విరామం అనంతరం మళ్లీ ఎయిర్ షోను నిర్వహిస్తున్నారు. నాలుగు రోజులపాటు సాగే ఈ ప్రదర్శనలో 200కు పైగా అంతర్జాతీయ సంస్థలు, ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు. ఆరువేలకు పైగా ట్రేడ్ విజిటర్స్, 50 వేల మంది సందర్శకులు పాల్గొంటారని అధికారుల అంచనా వేశారు. ఈ ప్రదర్శనలను వీక్షించాలనుకునే వారు వింగ్స్ ఇండియా అధికారిక వెబ్ సైట్‌లో ఆన్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటును అధికారులు కల్పించారు. తొలి మూడురోజులు వ్యాపారవేత్తలను, చివరిరోజు సాధారణ సందర్శకులు రూ.500 చెల్లించి ప్రదర్శనలను వీక్షించడానికి అవకాశం కల్పించారు.
#WingsIndia2022 is all geared up for a fabulous event with its airport infra partner Larsen & Toubro @larsentoubro while exploring opportunities to make flying a hassle-free experience for all. pic.twitter.com/M47822PSnQ
— Wings India 2022 (@WingsIndia2022) March 22, 2022