సెక్స్‌ విషయంలో డైరెక్టర్ ఇంట్రెస్ట్.. అది నా ఆర్ట్ అంటూ..

by sudharani |   ( Updated:2022-08-03 10:12:14.0  )
సెక్స్‌ విషయంలో డైరెక్టర్ ఇంట్రెస్ట్.. అది నా ఆర్ట్ అంటూ..
X

దిశ, సినిమా : 'కాఫీ విత్ కరణ్' షో అప్‌‌కమింగ్ ఎపిసోడ్‌‌కు అమీర్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ అతిథులుగా హాజరుకానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజైన ప్రోమోలో బాలీవుడ్ సెక్సువల్ లైవ్స్ గురించి మాట్లాడిన కరణ్‌కు తనదైన స్టైల్‌లో రిప్లయ్ ఇచ్చాడు అమీర్. సీజన్ 5లో కపిల్ శర్మకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురుకాగా.. అతను కూడా కరణ్‌పై సెటైర్స్ వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా.. దీపికా పదుకొణె అంటే క్రష్ అని చెప్పిన కపిల్‌ను ఆమెతో సెక్స్ కోసం ఏం చేస్తావని ప్రశ్నించాడు కరణ్. దీంతో షాకైన కపిల్.. మీరు ఏ విషయాన్నైనా చివరకు సెక్స్ వద్దకే తీసుకొస్తారెందుకు అని అడుగుతాడు. దీంతో 'ఏ టాపిక్ అయినా సరే సెక్సువల్‌గా మార్చడం నా ఆర్ట్' అని చెప్తాడు కరణ్. ఇక దీనిపై స్పందిస్తున్న నెటిజన్స్.. 'ఈ విషయాన్ని కరణ్ జోహార్ కాంప్లిమెంట్‌గా తీసుకున్నాడు కానీ అది వెటకారమే', 'ప్రజలు సెలబ్రిటీల లైంగిక జీవితంపై ఇంట్రెస్టింగ్‌గా ఉంటారు కాబట్టే అలా చేస్తున్నాడు' అని కామెంట్ చేస్తున్నారు.


టాయిలెట్‌లో తినమంటారా ఏంటి?.. హీరోయిన్ ఫైర్

Advertisement

Next Story