'డీసీ లీగ్‌ ఆఫ్‌ సూపర్‌ పెట్స్‌'మూవీ రిలీజ్ ఎప్పుడంటే!..

by sudharani |
డీసీ లీగ్‌ ఆఫ్‌ సూపర్‌ పెట్స్‌మూవీ రిలీజ్ ఎప్పుడంటే!..
X

దిశ, సినిమా : ప్రముఖ రచయిత, కన్సల్టెంట్ జారెడ్ స్టెర్న్ మొదటిసారిగా దర్శకత్వం వహించిన సినిమా 'డీసీ లీగ్ ఆఫ్ సూపర్ పెట్స్'. ఈ మూవీని వార్నర్ బ్రదర్స్ రిలీజ్ చేసేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రం ఆగస్టు 5న తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళం భాషల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఇందులో కృప్తో ది సూపర్ డాగ్‌కి.. మూవీ ప్రొడ్యూసర్ ద్వేన్ జాన్సన్ వాయిస్ అందించారు. ఈ చిత్రం గురించి మాట్లాడిన జాన్సన్.. సూపర్ హీరోస్ అయిన బ్యాట్ మ్యాన్, వండర్ ఉమన్, సూపర్ మ్యాన్‌ల పెంపుడు జంతువులను ఇంతకు ముందెన్నడూ సినిమాలలో చూడలేదు. కాబట్టి ఆ ఆలోచన రాగానే నమ్మకంతో తెరకెక్కించాను అని చెప్పారు.

Advertisement

Next Story