మహిళల్లో లైంగిక సందేహాలు తీర్చుతున్న 'బోల్ బెహెన్'

by Harish |
మహిళల్లో లైంగిక సందేహాలు తీర్చుతున్న బోల్ బెహెన్
X

దిశ, ఫీచర్స్ : బాలికలు, యువతుల్లో ఆరోగ్య సంబంధిత సందేహాల నివృత్తికి ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఓ కొత్త చాట్‌బోట్‌ను ప్రకటించింది. 'గర్ల్ ఎఫెక్ట్‌' అనే ఎన్‌జీవోతో కలిసి ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. 'బోల్ బెహెన్' పేరు గల ఈ చాట్‌బోట్‌ను ఫోన్ నంబర్‌ లేదా వెబ్‌లోని ఇన్విటేషన్ లింక్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. ఆ వివరాలు..

దేశవ్యాప్తంగా బాలికలు, మహిళలు తమ ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తుంటారు. లైంగికత, పునరుత్పత్తి వంటి అంశాలపై తమకు కలిగే సందేహాలను తీర్చుకునేందుకు డాక్టర్‌ను సంప్రదించేందుకు వెనకాడుతుంటారు. ఇంట్లోని పురుషులు కూడా ఈ విషయంలో సరిగా స్పందించరు. కాగా ఇలాంటి సమస్యల పరిష్కారానికి 'బోల్ బెహెన్' చాట్‌బోట్ సాయపడుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో నడిచే ఈ చాట్‌బోట్.. లైంగిక శ్రేయస్సు గురించి హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మహిళలకు అవగాహన కల్పిస్తోంది. ఇక 'బోల్ బెహెన్' విషయంలో ఏవైనా సందేహాలుంటే WhatsAppలో +91-730449661 నంబర్‌కు 'హాయ్' అని సెండ్ చేయండి.

పెద్ద సోదరిలా :

తొలిసారిగా బోల్ బెహెన్ చాట్‌బోట్‌‌ను ఫేస్‌బుక్ మెసెంజర్‌లో 2020లో ప్రారంభించారు. దీనికి ఇప్పటివరకు 1.6 మిలియన్ మెసేజెస్ వచ్చినట్లు తెలుస్తుండగా.. లక్షకు పైగా మహిళలు, బాలికలు తమ సందేహాల కోసం సంప్రదించినట్లు సమాచారం. ఇక 'గర్ల్ ఎఫెక్ట్' సౌత్ ఆఫ్రికాలోనూ ఇలాంటి సేవలందిస్తోంది. ఇది 87% కంటే ఎక్కువ కచ్చితత్వంతో ప్రశ్నలను గుర్తించగలదని మెటా పేర్కొంది.

Advertisement

Next Story