Allu Arjun: అల్లు అర్జున్‌కు ఏ విష‌యంలో ఎక్కువ‌గా కోపం వ‌స్తుందంటే?

by Prasanna |   ( Updated:2024-11-11 12:10:48.0  )
Allu Arjun: అల్లు అర్జున్‌కు ఏ విష‌యంలో ఎక్కువ‌గా కోపం వ‌స్తుందంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : బాల‌య్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాప‌బుల్ సీజన్ 4 ఆహా వేదిక‌గా స్ట్రీమింగ్ అవుతోంది. మూడు సీజ‌న్లు హిట్ అవ్వడంతో నాలుగో సీజ‌న్ స‌క్సెస్ ఫుల్‌గా దూసుకుపోతుంది. తాజాగా, నాలుగో సీజ‌న్‌లో నాలుగో ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమోను మేకర్స్ రిలీజ్ చేశారు. పుష్ప 2 మూవీ రిలీజ్ డేటు దగ్గర పడటంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా హాజరయ్యి ప్రమోషన్స్ ఇక్కడి నుంచి మొదలు పెట్టారు. ఈ షో లో సినిమాకి సంబంధించిన విషయాలతో పాటు నేషనల్ అవార్డు అందుకోవ‌డం గురించి కూడా ఆసక్తికర కామెంట్స్ చేసాడు.

ఇక బాలయ్య మీకు ఎలాంటి సంద‌ర్భాల్లో బాగా కోపం వ‌స్తుంద‌ని అల్లు అర్జున్‌ను అడగగా.. ‘నేను ఇది బ‌య‌టికి చెప్ప‌క‌పోవ‌చ్చు సార్‌.. అమ్మాయిల విష‌యంలో నాకు చాలా కోపం వస్తుంది. నా కళ్ళ ముందు ఎవరికైనా అన్యాయం జ‌రిగితే నేను చూస్తూ ఊరుకోను ’ అని అల్లు అర్జున్ అన్నారు.

ఇక చిరంజీవి, మ‌హేశ్‌బాబుల‌తో ఉన్న అనుబంధాన్ని ఈ షో లో చెప్పాడు. అల్లు అర్జున్ ఎపిసోడ్ రెండు భాగాలుగా స్ట్రీమింగ్ కానున్న‌ట్లుగా తెలుస్తోంది. నవంబర్‌ 15న ఆహా లో ఈ ఎపిసోడ్‌ స్ట్రీమింగ్ కానుంది.

Advertisement

Next Story

Most Viewed