- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nara Rohit-Siree Lella: నారా రోహిత్-సిరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
దిశ, సినిమా: యంగ్ హీరో నారా రోహిత్(Nara Rohit) ‘బాణం’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని ఇండస్ట్రీలో హీరోగా కొనసాగారు. కానీ 2018 నుంచి ఏమైందో తెలియదు కానీ సినిమాలకు దూరం అయ్యారు. ఏకంగా ఆరేళ్ల తర్వాత నారా రోహిత్(Nara Rohit) ‘ప్రతినిధి-2’(Prathinidhi 2) మూవీతో ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక నారా రోహిత్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఇన్నాళ్లు పెళ్లి చేసుకోకుండా బ్యాచ్‌లర్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రతినిధి-2 హీరోయిన్ సిరి లెల్లా(siree lella)తో ప్రేమలో పడిన ఆయన పెద్దలను ఒప్పించి అక్టోబర్ 13న నిశ్చితార్థం చేసుకున్నారు.
ఈ వేడుక చాలా అట్టహాసంగా జరగ్గా.. దీనికి పలువురు రాజకీయ నాయకులు, సినీ స్టార్స్ హాజరై సందడి చేశారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, నారా రోహిత్, సిరి ఏజ్ గ్యాప్ గురించి నెటిజన్లు నెట్టింట చర్చలు జరిపారు. దీంతో సిరి (siree lella)బ్యాక్ గ్రౌండ్ కూడా బయటకు వచ్చింది. అయితే రోహిత్(Nara Rohit) ఏజ్ 40 ఉండగా, సిరి వయస్సు 28.. అంటే వీరిద్దరి మధ్య 12 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న వారు కొందరు ఆశ్చర్యపోతున్నారు. ఇక సిరి విషయానికొస్తే.. మాచర్లకు చెందిన ఆమె అయినప్పటికీ హైదరాబాద్‌లో డిగ్రీ వరకు చదువుకున్నట్లు సమాచారం.
ఆ తర్వాత మాస్టర్స్ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఓ వైపు చదువుకుంటూనే షార్ట్ ఫిలిమ్స్ చేయడంతో పాటు పలు వీడియోలు కూడా చేసి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. దీంతో ప్రతినిధి-2(Prathinidhi 2) ఆడిషన్స్‌కు వెళ్లి హీరోయిన్‌గా చాన్స్ కొట్టేసి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. అంతేకాకుండా పెద్దింటి కోడలుగా వెళ్లబోతోంది. ప్రజెంట్ సిరి లెల్లాకు సంబంధించిన పలు విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read: జబర్దస్త్ బాబు డైరెక్షన్లో నారా రోహిత్ వైఫ్ సిరి లెల్లా తీసిన ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఇదే..