- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉమ్మడి నిజామాబాద్‌లో సంచలనం.. గర్భం దాల్చిన 8 మంది
దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గతకొన్ని రోజులుగా మైనర్‌లపై అఘాయిత్యాలు చోటుచేసుకుంటున్నాయి. అభంశుభం తెలియని బాలికలను మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడుతున్నారు. ప్రేమ, పెళ్లి అంటూ వారిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలికలపై అత్యాచారం చేసిన వారిలో కొందరు మైనర్ బాలురు ఉండగా మరికొన్ని సంఘటనల్లో యువకులు ఉన్నారు. ఈ ఘటనల్లోని బాధిత బాలికలను స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పరిధిలో సఖి కేంద్రంలో ఉంచి వారికి వైద్య పరిక్షలను నిర్వహించారు. కాగా వారిలో 8 మంది బాలికలు గర్భం దాల్చినట్లు పరీక్ష ఫలితాలు తేల్చాయి. ఇప్పుడు ఈ వ్యవహారం ఆందోళన కలిగిస్తుంది. ఫిర్యాదుల నేపథ్యంలో బాలికలపై ఇన్ని అఘాయిత్యాలు వెలుగులోకి రాగా, ఫిర్యాదు చెయ్యనివి ఇంకెన్ని ఉంటాయనే అంశం కలకలం రేపుతోంది.
నిజామాబాద్ నగరంలోని ధర్మపురి హిల్స్‌లో ఈ నెల 26న మైనర్ బాలికపై ఒక యువకుడు అత్యాచారం చేశారు. సోమవారం రాత్రి ఆరవ టౌన్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఈ నెల 13న మూడవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో మైనర్ బాలిక మిస్సింగ్ కేసు మూడవ టౌన్ పోలిస్ స్టేషన్‌లో నమోదు అయింది. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులకు విస్తుగొలిపే విషయాలు వెలుగు చూశాయి. బాలికను ప్రేమ పేరుతో తీసుకువెళ్లిన యువకుడు హైద్రాబాద్‌లో పెళ్లి చేసుకుని అఘాయిత్యానికి పాల్పడడ్డాడు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు అతడిపై మూడు సెక్షన్‌ల క్రింద కేసు నమోదు చేశారు.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎల్లారెడ్డి, ఇందల్ వాయి, బోధన్, గాజులపేట్, ఎడపల్లి, ధర్మపురి హిల్స్‌తోపాటు మరి కొన్ని ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నట్లు రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి తెలిపారు. 8 మంది బాలికలకు మెడికల్ టెస్టులు నిర్వహించగా అందరూ ప్రెగ్నెంట్ అయినట్లు తేలిందని ఆమె చెప్పారు. బాధిత బాలికలను నిజామాబాద్ సఖి సెంటర్ సంరక్షణలో చికిత్స అందిస్తున్నారని సూదం లక్ష్మి తెలిపారు. అభంశుభం తెలియని మైనర్లను మాయమాటలు చెప్పి మోసగించారన్నారు సూదం లక్ష్మి.. బాధితుల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారామె. బాలికలపై అఘాయిత్యాల ఘటనలు పునరావృతం కాకుండా, మహిళలకు భద్రత కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
దారుణం.. బ్రతికుండగానే భార్యను పూడ్చిపెట్టిన భర్త