- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నియోజకవర్గాన్ని అభివృద్దిలో ముందుంచుతాం: ఎమ్మెల్యే నన్నపునేని
దిశ, వరంగల్ టౌన్: వరంగల్ చార్ బౌళి లో 3 కోట్లతో నిర్మిస్తున్న రోడ్డు పనులు ఆదివారం డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, స్థానిక కార్పొరేటర్ బాలిన సురేష్, బస్వరాజు శిరీష శ్రీమాన్, కాంట్రాక్టర్‌తో కలిసి స్థానిక ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పరిశీలించారు. రోడ్డు పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. అత్యంత నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ.. తూర్పు నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు.
చార్ బౌళి లో రోడ్డు పనులు వేగంగా పూర్తి చేస్తామని అందులో భాగంగా పనులను పరిశీలించడం జరిగిందని తెలిపారు. యువ కార్పోరేటర్లు తమ వార్డుల అభివృద్దికి కృషి చేస్తున్నారని, అన్ని డివిజన్‌లను అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ముఖ్య నాయకులు, మున్సిపల్ అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.