'ఫ్రూట్' చాయ్.. ఎక్కడోయ్?

by Harish |   ( Updated:2023-04-01 15:58:21.0  )
ఫ్రూట్ చాయ్.. ఎక్కడోయ్?
X

దిశ, ఫీచర్స్: బాదం చాయ్, మసాలా టీ, అల్లం చాయ్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని రకాల చాయ్‌లు ఉన్నాయో తెలియదు కానీ ఇప్పుడు వీటికి 'ఫ్రూట్ చాయ్' యాడ్ అయింది. గుజరాత్ సూరత్‌లోని ఓ చాయ్ వాలా చేసిన ఈ 'టీ'.. నెట్టింట వైరల్ అయింది. మ్యాగీ మిల్క్‌షేక్స్, ఓరియో పకోరాస్ లాంటి డిఫరెంట్ ఫుడ్‌ కాన్సెప్ట్స్‌తో ఇప్పటికే అలిసిపోయిన నెటిజన్స్.. ఈ వైరల్ ఫుడ్ వీడియో చూసి 'జస్టిస్ ఫర్ చాయ్' అంటూ న్యాయ పోరాటానికి దిగారు.

ఆపిల్, అరటి పండు, సపోటాలతో కూడిన ఈ చాయ్ వీడియో.. 'ఫుడీ ఇన్‌కార్నేట్' హ్యాండిల్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్ట్ చేయబడింది. ఇప్పటికే లక్షల లైక్‌లు కొట్టేసిన ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్స్..'దీన్ని చాయ్ ఎందుకు అనాలి. హాట్ మిల్క్ షేక్ అని ఎందుకు అనకూడదు' అని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా, ఎవరెన్ని పోరాటాలు చేసుకున్నా.. ఈ ప్రయోగంతో ట్రెండ్ సెట్ చేసిన సూరత్ చాయ్ వాలా బిజినెస్ బాగుందని చెప్తుడడం విశేషం.

Advertisement

Next Story