Bigg Boss 8 Telugu: బిగ్‌బాస్ కంటెస్టెంట్‌కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన టాలీవుడ్ హీరో..!!

by Anjali |   ( Updated:2024-11-22 15:22:32.0  )
Bigg Boss 8 Telugu:  బిగ్‌బాస్ కంటెస్టెంట్‌కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన టాలీవుడ్ హీరో..!!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇప్పటివరకు విజయవంతంగా సాగిన తెలుగు బిగ్‌బాస్(Bigg Boss) సీజన్స్‌కు పలు హీరోలు.. తమ మూవీలను ప్రమోట్ చేయడానికి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీజన్-8 కు యంగ్ హీరో విశ్వక్(Vishvak Sen) సేన్ వచ్చాడు. తను నటించిన మెకానిక్ రాకీ(Mechanic Rocky) చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు వచ్చి.. కంటెస్టెంట్లతో సరదాగా మాట్లాడాడు. బిగ్‌బాస్ హౌస్ లోకి వెళ్లి.. కంటెస్టెంట్లతో కబుర్లు చెప్పి కామెడీ చేయడంతో పాటు కిచెన్ సమయాన్ని పెంచి వెళ్లాడు. అలాగే అవినాష్(Avinash) కు ప్రత్యేక బహుమతిని ఇచ్చాడు. అంతేకాకుండా లాస్ట్ గా మెగా చీఫ్ ఎవరవుతారని జరిగిన పోటీలో అయిదుగురు మెగా చీఫ్ కంటెండర్లు ఎంపిక అయ్యారు. దీంతో టాస్కులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇక విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రజెంట్ ఈ మూవీ థియేటర్లలో ఆడుతుంది. ఈ మూవీ కోసం విశ్వక్ సేన్ బాగానే కష్టపడ్డాడు. ఇక హౌస్‌లో ‘మెకానిక్ రాకీ’ నుంచి డైలాగులు చెప్పి అందరినీ ఎంటర్‌టైన్ చేశాడు.

Read More...

Bigg Boss Divi : పల్లెటూరి పడుచులా బిగ్ బాస్ దివి


Advertisement

Next Story

Most Viewed