- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
ప్రియుడితో ఫొటోలు షేర్ చేసిన విరూపాక్ష బ్యూటీ.. క్యూటెస్ట్ కపూల్ అంటున్న నెటిజన్లు
దిశ, సినిమా: ‘విరూపాక్ష’ సినిమాలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న సోనియా సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యూటీ షార్ట్ ఫిల్మ్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకొని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 'న్యూ ఏజ్ గర్ల్‌ఫ్రెండ్', 'పెళ్లైన కొత్తలో', 'నాన్- తెలుగు గర్ల్ ఫ్రెండ్' వంటి షార్ట్ పిల్మ్స్లో నటించిన ఈ భామకు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. అలా సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన విరూపాక్ష మూవీలో నటించే చాన్స్ కొట్టేసింది. ఇక ఈ సినిమాలో ఈ భామదే మెయిన్ రోల్ అన్న సంగతి తెలిసిందే. అలాగే ఈ భామ బుల్లితెరపై వచ్చిన 'యమలీల' సీరియల్లో కూడా నటించి మెప్పించింది. అంతేకాక నిత్యం సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ తన అంద చందాలతో అదరహో అనిపిస్తుంది.
ఇదిలా ఉంటే.. ఈ బ్యూటీ తన కోయాక్టర్ అయిన సిద్ధూ పవన్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా వారు పలు షోలలో పాల్గొన్న సమయంలో వెల్లడించారు. అయితే ఈ భామ తాజాగా తన ప్రియుడితో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేసింది. అందులో కపూల్ డ్రెస్ వేసుకొని ఫొటోలకి పొజులిచ్చారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక వీటిని చూసిన నెటిజన్లు ‘క్యూటెస్ట్ కపూల్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి మీరు వీటిపై ఓ లుక్ వేసేయండి.