రూటు మార్చిన హైడ్రా.. వృక్షాల పరిరక్షణపై హైడ్రా దృష్టి

by Mahesh |   ( Updated:2024-10-23 16:16:21.0  )
రూటు మార్చిన హైడ్రా.. వృక్షాల పరిరక్షణపై హైడ్రా దృష్టి
X

దిశ, తెలంగాణ బ్యూరో: న‌గ‌రంలో వృక్షాల ప‌రిర‌క్ష‌ణ‌తో పాటు ప్ర‌మాద‌క‌రంగా మారిన వృక్షాలకు సంబంధించి బుధ‌వారం హైడ్రా(HYDRAA) కార్యాల‌యంలో జీహెచెఎంసీ((GHMC), హైడ్రా, అట‌వీ శాఖ(Forest Department) అధికారుల‌తో హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్(Hydra Commissioner AV Ranganath) స‌మావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, ఫారెస్టు విభాగాల‌తో జోన్ల‌వారీ ఒక బృందాన్ని ఏర్పాటు చేయ‌డంతోపాటు ఈ బృందాల‌తో క్షేత్ర‌స్థాయిలో వృక్షాల స్థితిపై స‌ర్వే చేయాలని సమావేశం నిర్ణయించింది. కూల‌డానికి సిద్ధంగా ఉన్న వృక్షాల విష‌యంలో తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై స‌మీక్షించారు. ట్రీ ట్రాన్స్‌ప్లాంటేష‌న్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వ‌నున్నట్టు అధికారులు నిర్ణయించారు. వాల్టా (తెలంగాణ వాట‌ర్ ల్యాండ్ అండ్ ట్రీ యాక్ట్‌) చ‌ట్టం అమ‌లౌతున్న విధానాన్ని ప‌రిశీలించాలని, ట్రీ ట్రాన్స్‌ప్లాంటేష‌న్‌(Tree Transplantation) జ‌రుగుతున్న తీరు, 100 శాతం వృక్షాలు బ‌తికేలా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై దృష్టి సారించాలని హైడ్రా కమిషనర్ సూచించారు. వృక్షాలు ఎండిపోయి కూల‌డానికి సిద్ధంగా ఉన్న వాటిని గుర్తించి.. ప్రాణ‌హాని జ‌ర‌గ‌క‌ముందే వాటిని తొల‌గించాలని తెలిపారు.

ట్రాఫిక్‌కు ఇబ్బందిగా, కూలేందుకు సిద్ధంగా ఉన్న వృక్షాలను గుర్తించ‌డం.. ప్ర‌మాదం జ‌ర‌గ‌కుండా అక్క‌డ తీసుకోవాల్సిన చ‌ర్య‌లు, ఆయా విభాగాలు అనుసరించాల్సిన బాధ్యతల గురించి చర్చించారు. ట్రాఫిక్‌కు ఇబ్బందిగా మారుతున్న వాటి కొమ్మ‌ల‌ను ట్రిమ్మింగ్ చేయ‌డం, ఇంకా ఇబ్బందిగా ఉంటే వాటిని వేరే చోటుకు త‌ర‌లించి ట్రీ ప్లాంటేష‌న్ విధానంలో పెంచ‌డం, వృక్షాలు తొల‌గించిన ద‌గ్గ‌ర మొక్క‌లు నాట‌డం అంశాలపై ప్రత్యేకంగా చర్చించారు. విద్యుత్ తీగ‌ల‌కు త‌గులుతున్నాయ‌ని, అశా స్త్రీయంగా వృక్షాల కొమ్మ‌లు న‌ర‌క‌డం జ‌ర‌గ‌కుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. వాహ‌నాల‌కు త‌గులుతున్నాయ‌ని ఒక వైపే కొమ్మ‌ల‌ను తొల‌గించ‌డం వ‌ల్ల వృక్షాల బ్యాలెన్సు కోల్పోయి ప‌డిపోయే ప్ర‌మాదముందని, కొమ్మ‌లు తొల‌గించ‌డంలో శాస్త్రీయ విధానాల‌ను అనుస‌రించ‌డం త‌దిత‌ర అంశాల‌పై హైడ్రా క‌మిష‌న‌ర్‌ సమీక్షించారు.

Read More..

ఆక్రమణలను గుర్తించేందుకు.. త్రీడీ శాటిలైట్ ఇమేజింగ్ టెక్నాలజీ

Advertisement

Next Story

Most Viewed