Swiggy: ఆహార నాణ్యత కోసం 'సీల్ బ్యాడ్జ్' సేవలను ప్రారంభించిన స్విగ్గీ

by S Gopi |
Swiggy: ఆహార నాణ్యత కోసం సీల్ బ్యాడ్జ్ సేవలను ప్రారంభించిన స్విగ్గీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ బుధవారం సరికొత్త సేవలను ప్రారంభించింది. ఇటీవల ఆహార భద్రతకు సంబంధించి పెరుగుతున్న ఆందోళనలను పరిష్కరించేందుకు స్విగ్గీ 'స్విగ్గీ సీల్ ' సేవలను తీసుకొచ్చింది. ఇది పరిశుభ్రత, ఫుడ్ క్వాలిటీ ప్రమాణాలను ధృవీకరిస్తుంది. రెస్టారెంట్లలో పరిశుభ్రంగా ఉండే ఆహారం, నాణ్యత, ప్యాకింగ్ ప్రమాణాలను పాటించే వాటికి వినియోగదారులు ఇచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా బ్యాడ్జ్‌కు స్విగ్గీ కేటాయిస్తుంది. ప్రస్తుతానికి ఈ సేవలను పూణెలో మాత్రమే అందుబాటులో ఉన్నాయని, నవంబర్ నాటికి 650 నగరాలకు విస్తరించనున్నట్టు స్విగ్గీ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఈ కొత్త విధానంపై రెస్టారెంట్ల నుంచి కూడా స్పందన సానుకూలంగా ఉంది. రెస్టారెంట్ల పరిశుభ్రతకు సంబంధించి ఆడిట్ కోసం ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తింపు ఉన్న ఏజెన్సీలతో భాగస్వామ్యం చేసుకున్నామని స్విగ్గీ స్పష్టం చేసింది. బ్యాడ్జ్ పొందిన తర్వాత కూడా రెస్టారెంట్లపై వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందితే దాన్ని తొలగిస్తామని వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed