ప్రభుత్వంపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం.. మంత్రి జూపల్లి సీరియస్

by Gantepaka Srikanth |
ప్రభుత్వంపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం.. మంత్రి జూపల్లి సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేతలపై మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధి కోసమే ప్రభుత్వంపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. వ్యూహాత్మకంగా కేసీఆర్‌(KCR), కేటీఆర్(KTR), హరీష్‌రావులు ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని అన్నారు. ప్రజలు పదేళ్ల పాలనలో రూ.7 లక్షల కోట్ల అప్పులు చేశారని సీరియస్ అయ్యారు. అలాంటి బీఆర్ఎస్ నేతలు తమను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.

ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు చురకలు అంటించారు. కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పార్టీ అని అన్నారు. అవినీతి, కుటుంబ పాలనకు తాము వ్యతిరేకమని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడి పది నెలలు కూడా కాకముందే ప్రజలకు ఎన్నో సంక్షేమ ఫలాలు అందించామని తెలిపారు. అభివృద్ధిని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ విశ్వప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed