Bigg Boss-8:అర్ధరాత్రి హౌస్‌లోకి దెయ్యం.. భయంతో వణికిపోయిన కంటెస్టెంట్స్ (వీడియో)

by Hamsa |   ( Updated:2024-10-23 16:00:34.0  )
Bigg Boss-8:అర్ధరాత్రి హౌస్‌లోకి దెయ్యం.. భయంతో వణికిపోయిన కంటెస్టెంట్స్ (వీడియో)
X

దిశ, సినిమా: తెలుగు రియాలిటీ బిగ్‌బాస్-8(Bigg Boss-8) షో 52 రోజులు పూర్తి చేసుకుంది. అయితే ఈ సారి అన్ని సీజన్ల మాదిరి కాకుండా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మాజీ కంటెస్టెంట్స్ ఇంట్లోకి వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా, బిగ్‌బాస్-8(Bigg Boss-8) హౌస్‌లో షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. అందరూ పడుకున్న సమయంలో గంగవ్వ(Gangavva) లివింగ్ రూమ్‌లోని సోఫాలో కూర్చొని దెయ్యం పట్టినట్టుగా ప్రవర్తించింది. దీంతో కంటెస్టెంట్స్ అంతా అంతా ఆమె దగ్గరకు వెళ్లి ఏమైందో అని తెగ టెన్షన్ పడిపోయారు.

ఇక నయని పావని స్టోర్ రూమ్ కెమెరా ప్లీజ్ రెస్పాండ్ అని భయంతో అరిచేసింది. ఇక మిగతా కంటెస్టెంట్స్ కూడా భయంతో ఆమెకు దూరంగా ఉండిపోయారు. ఇదంతా జరుగుతుండగానే లేడీ కంటెస్టెంట్స్ ఇప్పుడు ఎలా పడుకోవాలి చాలా భయమేస్తుందని చర్చించుకుంటారు. అయితే గంగవ్వ మాత్రం పెద్ద పెద్దగా అరుస్తూ చివరకు సైలెంట్ అయిపోయి పడిపోతుంది. ఇక టేస్టీ తేజ, అవినాష్(Avinash) ఆమెను బెడ్‌పై పడుకోబెడతారు. అయితే ఇదంతా ముందుగానే గంగవ్వ, అవినాష్, తేజ ప్లాన్ చేసుకుని ఫ్రాంక్ చేసినట్లు తెలుస్తోంది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ప్రోమో వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.



Advertisement

Next Story