Nilgiri Oil: ఈ సమస్యలను తరిమికొట్టడంలో నీలగిరి తైలం మంచి ఔషధం..!

by Anjali |   ( Updated:2024-10-25 15:17:56.0  )
Nilgiri Oil: ఈ సమస్యలను తరిమికొట్టడంలో నీలగిరి తైలం మంచి ఔషధం..!
X

దిశ, వెబ్‌డెస్క్: శతాబ్దాలుగా, నీలగిరి తైలం(Nilgiri oil) ఆకులను సాంప్రదాయ వైద్యంలో గాయాలు నయం చేయడానికి ఉపయోగిస్తారు. పగిలిన పాదాలు, పొడి చర్మం(dry skin), జలుబు, పుళ్లు వంటి వాటికి మంచి ఔషధమని చెప్పుకోవచ్చు. అలాగే చర్మ పరిస్థితులకు చికిత్స చేయడానికి కూడా నీలగిరి తైలాన్ని ఉపయోగిస్తారు. నీలగిరి నూనె తేమ ప్రభావాన్ని కలిగి ఉంటుంది చర్మానికి ఉపశమనం కలిగిస్తుంది. కోల్డ్(Cold) అయినప్పుడు నీలగిరి తైలం మరగబెట్టిన నీళ్లలో వేసి ఆవిరి పట్టుకుంటే తొందరగా నయమవుతుంది. మౌత్ వాష్ లు, టూత్ పేస్టులను రెడీ చేయడానికి నీలగిరి ఆయిల్ ను వాడుతారు. నోటిలో హానికరమైన బ్యాక్టీరియా(Harmful bacteria)ను తొలగించడంలో నీలగిరి తైలం ఆకులు బాగా ఉపయోగపడుతాయి. ఇది చర్మంలో ఉండే సిరామైడ్ అనే కొవ్వు ఆమ్లం ఉత్పత్తిని పెంచడం వల్ల పొడి చర్మాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే స్టెయిన్ రిమూవర్లు, క్లెన్సర్లు, స్టెయిన్ రిమూవర్లు గార్డెన్ స్ర్పే వంటివి క్లీన్ చేసే ఉత్పత్తులను తయారు చేయడానికి వాడుతారు.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story