ట్రాఫిక్ రూల్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలి : కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

by Aamani |
ట్రాఫిక్  రూల్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలి : కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
X

దిశ, మహబూబాబాద్ టౌన్ : రోడ్డు ప్రమాదాలు సంభవించకుండా నివారించగలిగితే మనుషుల ప్రాణాలు రక్షించడమే కాకుండా, కుటుంబాలను నిలబెట్టిన వారమవుతామని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి రోడ్డు భద్రత సమావేశం నిర్వహించారు. జాతీయ ,రాష్ట్ర రహదారులు, అలాగే ఇతర రహదారులపై ప్రమాదాలు సంభవించేందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను పోలీసు,ఇంజనీరింగ్ అధికారుల సంయుక్త బృందాలు తనిఖీ చేసి సమర్పించిన నివేదిక ఆధారంగా, ప్రత్యేకించి పోలీసు అధికారుల సూచనలను మేరకు సంబంధిత శాఖలు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చెప్పారు. వర్షాల వల్ల గుంతలు పడిన అన్ని రహదారులను వెంటనే మరమ్మతులు చేయించాలని, అలాగే రహదారుల మలుపుల వద్ద ముళ్ళ పొదలు, చెట్ల కొమ్మల వల్ల ప్రమాదాలు సంభవించేందుకు ఆస్కారం ఉన్న వాటిని గుర్తించి తొలగించాలని కలెక్టర్ సూచించారు.

జిల్లా ఎస్పీ సుధీర్ రామనాథన్ కేకన్ మాట్లాడుతూ.. జిల్లాలో (20) బ్లాక్ స్పాట్స్ గుర్తించామని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ ,జాతీయ రహదారుల ఇంజనీరింగ్ అధికారులతో అన్ని రహదారులపై తనిఖీ నిర్వహించి ప్రమాదాలు సంభవించేందుకు ఆస్కారం ఉన్న ప్రదేశాలలో స్థానిక ప్రజాప్రతినిధులు, సబ్ ఇన్స్పెక్టర్లు సహకారంతో స్పీడ్ బ్రేకర్లు, లైట్లు, స్టాపర్స్, రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయడం జరిగిందని, వీటన్నిటిని ఏర్పాటు చేసిన తర్వాత ప్రమాదాల సంఖ్య తగ్గిందని తెలిపారు. జిల్లా మొత్తం కవర్ చేయడం ద్వారా బ్లాక్ స్పాట్స్ లో ప్రమాదాలను నివారించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు, స్థానిక సంస్థలు, రెవెన్యూ లెనిన్ వత్సల్ టోప్పో, డేవిడ్, ఆర్ అండ్ బి ఈ ఈ భీమ్లనాయక్, డిర్టీవో జైపాల్ రెడ్డి, ఆర్టిఓ సాయి కిరణ్, డాక్టర్ జగదీశ్వర్, డాక్టర్ వెంకట రమణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ మురళీధర్, మున్సిపల్ డీఈ ఉపేందర్, నేషనల్ హైవే డిఈ అమీర్, బషీర్ ,కలెక్టరేట్ ఏఓ పవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed