- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లో కూడా రాణించాలి
దిశ,వనపర్తి : విద్యార్థి దశలో ప్రతి విద్యార్థి విద్యాతో పాటుగా.. క్రీడలకు ప్రధాన్యతనివ్వాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నా రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం వనపర్తి మండలం,చిట్యాలలో మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలల క్రీడా పోటీలను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నా రెడ్డి జ్యోతిని వెలిగించి ప్రారంభించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. విద్యార్థులకు విద్యా ఏంత ముఖ్యమో క్రీడలు ఆడడం అంతే ముఖ్యమన్నారు. ప్రభుత్వ పాఠశాలలో,గురుకులాల్లోని విద్యార్థులు విద్యకు - క్రీడలకు ప్రాధాన్యతనివ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించేందుకు క్రీడా పాఠశాలను బలోపేతం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్ర క్రీడాకారులు భవిష్యత్తు లో అంతర్జాతీయ స్థాయి పోటీలలో రాణించేలా గ్రామ,మండల,జిల్లా స్థాయిలలో పోటీలను నిర్వహిస్తుందన్నారు. విద్యార్థులు క్రీడాలలో ప్రావీణ్యం సాధించి..విజయాలు సాధించాలని అకాంక్షించారు. చిట్యాల గురుకుల పాఠశాల ను ఇంటర్మీడియట్ స్థాయి విద్యా వరకు అప్గ్రేడ్ చేసేందుకు ప్రభ్యత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఈ కార్యక్రమం లో మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గురువయ్య,బోధన,బోధనేతరా సిబ్బంది,కాంగ్రెస్ నాయకులు పెద్ద కోటయ్య,సురేష్ గౌడ్,యువజన నాయకులు గడ్డం వినోద్,కుమార్ గౌడ్,హన్మంతు,బాలు తదితరులు పాల్గొన్నారు.