- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెచ్చిపోతున్న లోన్ యాప్ ఆగడాలు
దిశ, ఏపీ బ్యూరో : తెలుగు రాష్ట్రాల్లో లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. మధ్యతరగతి కుటుంబాలే కాదు.. ప్రముఖులకూ ఈ వేధింపులు తప్పడం లేదు. నెల్లూరు జిల్లా మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డికి బెదిరింపులు వచ్చి 24గంటలు గడవక ముందే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు వేధింపులు మెుదలయ్యాయి. పాతపాటి అశోక్ కుమార్ రూ.8లక్షలు అప్పు తీసుకున్నాడని అది చెల్లించాలంటూ మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు రికవరీ ఏజెంట్ ప్రియాంక ఫోన్ చేసింది. తొలుత మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆమెతో చాలా హుందాగా మాట్లాడారు. అశోక్ కుమార్ మీ బ్రదర్ ఇన్‌లా అని చెప్పి రూ.8లక్షలు లోన్ తీసుకున్నారని చెప్పుకొచ్చింది. మీరు మీ బ్రదర్ ఆ డబ్బులు వాడుకున్నారని.. ఆ డబ్బు కట్టాలని కోరింది. అసలు అతడు ఎవరో తనకు తెలియదని..తనకు బావమరుదులు, బావ మరిది సోదరులు ఎవరూ లేరని చెప్పుకొచ్చారు.
ఫ్లోట్రన్ బ్యాంకులో రూ.8లక్షలు లోన్ తీసుకున్నారని ఆ డబ్బులు చెల్లించడం లేదని మీరు చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. దీంతో అనిల్ కుమార్ యాదవ్ కోపడ్డారు. లోన్ తీసుకున్న వ్యక్తిని ఎత్తికెళ్లి లోపల వేయాలంటూ సూచించారు. అయినప్పటికీ డబ్బులు ఎవరు కడతారని నిలదీయగా మంత్రి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. చెప్పుతో కొడతా అని వార్నింగ్ ఇచ్చారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే చెప్పుతో కొడతా అంటూ హెచ్చరించారు. దారిన పోయిన వాళ్లు ఎవరో తన నంబరు ఇస్తే తనకు కాల్ ఎలా చేస్తారని మండిపడ్డారు. మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ సంబంధం లేకపోయినా రుణం తీసుకోకపోయినా లోన్ ఏజెంట్లు పదేపదే ఫోన్‌లు చేసి రుణం కట్టాలని రోజుకి 29 సార్లు ఫోన్ చేస్తున్నడంతో సహనం కోల్పోయిన మాజీ మంత్రి అనిల్ చెప్పుతో కొడతానంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. రికవరీ ఏజెంట్‌తో మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంభాషణకు సంబంధించిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.