Vijay Deverakonda : కేజిఎఫ్ లాంటి సినిమాతో రాబోతున్న విజయ్ దేవరకొండ.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోన్న నిర్మాత

by Anjali |
Vijay Deverakonda : కేజిఎఫ్ లాంటి సినిమాతో రాబోతున్న విజయ్ దేవరకొండ.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోన్న నిర్మాత
X

దిశ, వెబ్‌డెస్క్: అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. యూత్‌తో ఫుల్ క్రేజ్ దక్కించుకున్నాడు. విజయ్ యాటిట్యూడ్, డేర్ గా మాట్లాడటం, ఆ స్టైల్.. ప్రతి ఒక్కదానికి ముఖ్యంగా గర్ల్ ఫ్యాన్ ఫాలోయింగే భారీగా ఉందని చెప్పుకోవచ్చు. మొదట్లో పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ పాత్రల్లో నటించి తన టాలెంట్‌తో హీరోగా అవకాశాలు దక్కించుకున్నాడు. పెళ్లి చూపులు, ద్వారక, అర్జున్ రెడ్డి, మహానటి, హే మంత్రం వేసవే, గీత గోవిందం, నోటా, ఈ నగరానికి ఏమైంది, టాక్సీవాలా, డియర్ కామ్రేడ్, మీకు మాత్రమే చెప్తా, లైగర్, ది ఫ్యామిలీ స్టార్, ఖుషీ, కల్కి 2898 వంటి చిత్రాల్లో నటించి విజయ్ దేవరకొండ మరింత ఫేమ్ దక్కించుకున్నాడు.

ఇకపోతే మన కుర్ర హీరో చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. వరుస సినిమాలతో విజయ్ దూసుకుపోతున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో VD12ని తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కేరళలో జరుపుకుంటోంది. తాజాగా చిత్ర నిర్మాత నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో VD12 గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో కేజిఎఫ్ లాంటి మూవీని తీస్తున్నామని తెలిపారు.డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కేజిఎఫ్ మూవీ తీస్తే ఎలా ఉంటుందో విజయ్‌తో ఈ దర్శకుడు చేసే మూవీ ఆ రేంజ్‌లో ఉండనుందని ప్రేక్షకులకు భారీ అంచనాలు పెంచుతున్నాడు. అలాగే సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యాకే ప్రమోషన్స్ ప్రారంభిస్తామని జనాలకు క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు కేవలం ఒక్క పోస్టర్ మాత్రమే విడుదల చేసిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది మార్చి 28 వ తారీకున ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.

Next Story

Most Viewed