స్విమ్ సూట్‌లో కత్రినా.. విక్కీ ఫాదర్ షాకింగ్ కామెంట్స్

by Harish |   ( Updated:2022-04-08 10:20:37.0  )
స్విమ్ సూట్‌లో కత్రినా.. విక్కీ ఫాదర్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: ఫిల్మ్ ఇండస్ట్రీలో వయసుతో సంబంధం లేకుండా కో-స్టార్స్‌ను పెళ్లి చేసుకోవడం మామూలే. ఏళ్ల తరబడి లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉండి, ఆ తర్వాత ఒక్కటైనవారిలో ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనె వంటి స్టార్ హీరోయిన్లు ముందు వరుసలో ఉన్నారు. వీరంతా పెళ్లి తర్వాత కూడా బోల్డ్ సీన్లలో నటించేందుకు వెనకాడలేదు. కానీ అలాంటి సీన్లలో నటించినప్పుడు నెటిజన్ల నుంచి విపరీతంగా ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. ఇదిలా ఉంటే, రీసెంట్‌గా కో-స్టార్ విక్కీ కౌశల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న కత్రినా కైఫ్.. బీచ్‌లో బ్లాక్ డ్రెస్‌లో దిగిన హాట్ పిక్స్‌ను అభిమానులతో పంచుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 62 మిలియన్ ఫాలోవర్లను రీచ్ అయిన సందర్భంగా ఈ ఫొటోలు షేర్ చేసింది. ఇక ఈ పిక్స్‌ చూసిన అభిమానులతో పాటు తోటి హీరోయిన్లు కూడా హాట్‌గా ఉన్నావంటూ కామెంట్లు చేశారు. ఆశ్చర్యకరంగా విక్కీ కౌశల్ తండ్రి శ్యామ్ కౌశల్ ఈ ఫొటోపై 'హౌ క్యూట్ ఈజ్ దట్' అంటూ కామెంట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. దీన్ని బట్టి కత్రినాకు విక్కీ ఫ్యామిలీ ఎంత సపోర్ట్‌గా ఉందో తెలుస్తోంది.

Advertisement

Next Story