'మసాన్'కు ఏడేళ్లు.. దిల్ సే షుక్రియా అంటున్న విక్కీ

by Mahesh |
మసాన్కు ఏడేళ్లు.. దిల్ సే షుక్రియా అంటున్న విక్కీ
X

దిశ, సినిమా : బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ ఫ్యాన్స్‌ను అలరిస్తుంటాడు. ఎప్పుడూ వ్యక్తిగత జీవితం, కెరీర్ గురించి అసక్తిర విషయాలు పంచుకునే హీరో.. తాజాగా తన స్వీట్ మెమొరీస్ గుర్తుచేసుకున్నాడు. విక్కీ నటించిన తొలి చిత్రం 'మసాన్(2015)' ఏడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్పెషల్ పోస్ట్ షేర్ చేశాడు. '7 సాల్ హో గయే! దిల్ సే షుక్రియా' క్యాప్షన్‌తో నువ్వుతూ సిగ్గుపడుతున్న ఫొటోను పోస్ట్ చేయగా ప్రస్తుతం వైరల్ అవుతోంది. రిచా ‌చద్దా, శ్వేతా త్రిపాఠి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో తక్కువ కులం అబ్బాయి, అగ్రవర్ణ అమ్మాయి మధ్య ఆవిష్కరించిన విషాదకరమైన ప్రేమకథ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.

Advertisement

Next Story