- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vettaiyan: అక్కడ ‘వేట్టయన్’ రికార్డు.. మొదటి రోజు కలెక్షన్ ఎంతంటే?
దిశ, సినిమా: సూపర్‌స్టార్ రజినీకాంత్ (Superstar Rajinikanth) లేటెస్ట్ మూవీ ‘వేట్టయన్- ద హంటర్’ (Vettaiyan). ‘జై భీమ్’ ఫేమ్ టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మించారు. సురేష్ ప్రొడక్షన్స్‌తో కలిసి ఏసియన్ సునీల్, దిల్ రాజు ఈ చిత్రాన్ని తెలుగులోకి రిలీజ్ చేశారు. భారీ అంచనాల మధ్య అక్టోబర్ 10 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. ప్రజెంట్ ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది. అయితే.. వేట్టయన్ (Vettaiyan) సినిమా ఇక్కడ మిక్సిడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కోలీవుడ్ (Kollywood)లో మాత్రం సంచలనం సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఈ మూవీ తొలి రోజు కలెక్షన్లలోనూ రికార్డును సృష్టిస్తుంది. ఈ మేరకు కోలీవుడ్ (Kollywood)లో ఈ ఏడాది విడుదలై అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల్లో మొదటి స్థానంలో విజయ్ ‘ది గోట్’ నిలవగా.. రెండో స్థానంలో ‘వేట్టయన్’ (Vettaiyan) నిలిచింది. ఇక కలెక్షన్ల విషయానికి వస్తే.. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 60 కోట్లు (గ్రాస్) వసూలుచేసినట్లు సమాచారం. అయితే.. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ (Official Announcement) రావాల్సి ఉంది.