- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tollywood Director : యాక్టర్‌గా ఎంట్రీ ఇచ్చి దర్శకుడిగా వరుస హిట్లు కొడుతోన్న వెంకీ..!!
దిశ, వెబ్‌డెస్క్: ఇండస్ట్రీలో కొంతమంది కేవలం హీరోగానో, డైరెక్టర్‌గా, నిర్మాతగానో సెటిల్ అయిపోతుంటారు. కానీ పలువురు తమ టాలెంట్‌ను నిరూపించుకోవడం కోసం హీరోగా, నిర్మాతగా, డైరెక్టర్‌గా, నటుడిగా సత్తా చాటుతారు. అదే కోవకు చెందిన హీరోగా, నటుడిగా, ఎన్నో సినిమాలు చేసి.. ఆడిషన్స్ కూడా ఇచ్చి ప్రస్తుతం దర్శకుడిగా మంచి పేరు సొంతం చేసుకుంటున్నాడు వెంకీ అట్లూరి(Venky Atluri). ఈయన నటుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. 2007 లో కథానాయకుడిగా జ్జాపకం(Jjapakam) అనే మూవీతో ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. తర్వాత రచయితగా పనిచేశాడు.
అంతేకాకుండా కొన్ని మూవీల్లో చిన్న చిన్న పాత్రలు కూడా పోషించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. ఇక 2018 లో తొలిప్రేమ(tholiprema) చిత్రంతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చి.. తొలి సినిమాతోనే భారీ హిట్ కొట్టాడు. తర్వాత సర్ సినిమాతో మరింత ఫేమ్ దక్కించుకున్నాడు. ఇప్పుడు దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) హీరోగా వచ్చిన లక్కీ భాస్కర్ చిత్రానికి దర్శకత్వం వహించి మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించగా వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు.
నాగ్ అశ్విన్(Nag Ashwin), హను ను ఈ కార్యక్రమంలో చూడడం చాలా ఆనందంగా అనిపిస్తుందని అన్నాడు. తను నటుడిగా ఉన్నప్పుడు చంద్రశేఖర్ యేలేటి (Chandrasekhar Yeleti) మూవీ కోసం హను తనను ఆడిషన్ కు పిలిచారని చెప్పకొచ్చాడు. అలా లైఫ్ ఈజ్ బ్యూటిపుల్ చిత్రానికి నాగ్ అశ్విన్ వెంకీ అట్లూరుని ఆడిషన్ చేశారని తెలిపారు. ఇప్పుడు హీరో దుల్కర్ సల్మాన్ తో మూవీస్ చేసి.. పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నామని వెల్లడించారు. తర్వాత నాగ్ అశ్విన్ మాట్లాడారు. అప్పుడు ఆడిషన్ చేస్తే ఇప్పుడు దర్శకుడిగా వరుస హిట్లు కొడుతున్నాడంటూ సరదాగా నవ్వుకుంటూ కామెంట్లు చేశాడు. అలాగే వెంకీ అట్లూరిపై అంతా పొగడ్తల వర్షం కురిపించారు.