- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Varun Tej, Meenakshi Chaudhary: మట్కా నుంచి వరుణ్, మీనాక్షీ చౌదరి లుక్ రిలీజ్.. బ్లాక్ అండ్ వైట్‌లో ఆకట్టుకుంటున్న జంట
దిశ, సినిమా: మెగా ప్రిన్స్ (Mega Prince) వరుణ్ తేజ్ (Varun Tej) లేటెస్ట్ సినిమా ‘మట్కా’ (Matka). కరణ్ కుమార్ (Karan Kumar) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని వైరా ఎంటర్‌టైన్మెంట్, ఎస్ఆర్‌టీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. 1958-1982 మధ్య కాలంలో దేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన కొన్ని నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కబోతున్న ‘మట్కా’ చిత్రంలో వరుణ్ తేజ్ (Varun Tej) సరసన మీనాక్షీ చౌదరి నటించనుంది. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్‌డేట్స్ ఆకట్టుకోగా.. భారీ అంచనాల మధ్య ఈ సినిమా నవంబర్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. రిలీజ్ సమయం దగ్గర పడటంతో.. మూవీ నుంచి వరుస అప్‌డేట్స్ ఇస్తున్నారు చిత్ర బృందం. ఇందులో భాగంగా తాజాగా.. వరుణ్ తేజ్, మీనాక్షీ చౌదరి లుక్‌ను రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్ బ్లాక్ అండ్ వైట్ మోడ్‌లో ఉండగా.. మీనాక్షి అమాయకంగా లంగా వోణీ గెటప్‌లో, వరుణ్ ఉంగరాల జుట్టు, మెడలో నల్ల తాడుతో అదిరిపోయే లుక్‌లో దర్శనమిచ్చారు. ప్రజెంట్ ఈ పోస్టర్ నెట్టింట విశేషంగా ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ సినిమాలో నవీన్ చంద్ర, సలోని, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, రవి శంకర్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.